Namrata Re-Entry Into Movies: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోడ్కర్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు.. బాలీవుడ్ లో ఆమె ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్..మన టాలీవుడ్ లో ఆమె వంశీ సినిమా ద్వారా మన అందరికి పరిచయం అయిన సంగతి తెలిసిందే.. వాస్తవానికి ఆమె తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన అంజి సినిమా.. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ వాయుదాలు పడుతూ బాగా లేట్ అవ్వడం తో ముందుగా వంశీ సినిమా విడుదల అయ్యింది.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు మరియు నమ్రత మధ్య ప్రేమ ఏర్పడడం ఆ తర్వాత వీళ్లిద్దరు సీక్రెట్ గా పెద్దల సమక్షం లోనే పెళ్లి చేసుకోవడం మన అందరికి తెలిసిన విషయమే..నమ్రత శిరోద్కర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ బాబు కి ప్రతి ఒక్క విషయం కలిసి వచ్చింది..ఈ దంపతులు ఇద్దరికీ గౌతమ్ మరియు సితార అనే ఇద్దరు పిల్లు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబానికి తగిన సమయం ఎప్పుడు కేటాయిస్తూ ఉంటాడు..ప్రతి సినిమా విడుదల అయిన తర్వాత రెండు మూడు నెలలు ఫారిన్ కి హాలిడే ట్రిప్ వెళ్లే మహేష్ బాబు..సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి సక్సెస్ అవ్వడం తో ప్రస్తుతం ఆయన ఫామిలీ తో కలిసి జర్మనీ టూర్ లో ఉన్నాడు.
Also Read: Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసు: బాలిక మెడికల్ రిపోర్టులో దారుణ నిజాలు
ఇది ఇలా ఉండగా నమ్రత శిరోద్కర్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు ని పెళ్లి చేసుకున్న తర్వాత నమృత శిరోద్కర్ సినిమాలు పూర్తిగా మానేసి భార్య గా ఇంటి బాధ్యతలను నిర్వహించడం లో బిజీ గా మారిపోయింది..అంతే కాకుండా మహేష్ బాబు కి సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా నమ్రత దగ్గర ఉందిమరి చూసుకునేది..ఆయన వ్యాపార బాధ్యతలను కూడా మొత్తం నమ్రత శిరోద్కర్ సారథ్యం లోనే జరుగుతుంటాయి..అంత బిజీ లైఫ్ ని గడుపుతున్న నమ్రత శిరోద్కర్ మళ్ళీ సినిమాలకి వస్తుంది అంటూ ప్రచారం జరగడం తో మహేష్ బాబు అభిమానులు ఒక్కరిసారిగా షాక్ కి గురి అయ్యారు..అయితే ఈ విషయం పై నమ్రత శిరోద్కర్ స్పందిస్తూ ‘ చాలా కాలం నుండి నేను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని వార్తలు వస్తున్నాయి..కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు..నేను ఎప్పుడు కూడా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకోలేదు..భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన నాకు రాకపోవచ్చు..ఒక్కవేల మా భర్త మహేష్ బాబు సినిమాలో చెయ్యాల్సి వస్తే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్.
Also Read: Vallabhaneni Vamsi: గన్నవరంలో ‘మట్టి’ మంటలు.. వంశీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు