‘సర్కారు’లో నమ్రతా అతి ప్రమేయం.. నిజమేనా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాని మొదలుపెట్టినప్పటి నుండి, ఆ సినిమాకి సంబంధించి వినిపిస్తోన్న ఏకైక క్రేజీ రూమర్ ఒక్కటే. ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదని.. ఆ పాత్ర పై మంచి సన్నివేశాలు వస్తాయని ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, ఆ ఫాదర్ పాత్రలో మొదట చాలమంది హీరోలనే అనుకున్నా.. చివరకు ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారని ఆ మధ్య […]

Written By: admin, Updated On : April 21, 2021 1:07 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాని మొదలుపెట్టినప్పటి నుండి, ఆ సినిమాకి సంబంధించి వినిపిస్తోన్న ఏకైక క్రేజీ రూమర్ ఒక్కటే. ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదని.. ఆ పాత్ర పై మంచి సన్నివేశాలు వస్తాయని ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, ఆ ఫాదర్ పాత్రలో మొదట చాలమంది హీరోలనే అనుకున్నా.. చివరకు ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారని ఆ మధ్య వినిపించింది. ఇది సినిమాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉండలనే మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేయలేదని అన్నారు.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ కపూర్ ఈ సినిమాలో నిజంగానే నటిస్తున్నాడట. మొదట అనిల్ ఒప్పుకోకపోయినా.. నమ్రతా బలవంతంతో అంగీకరించాడని.. అనిల్ కి నమ్రతకు మధ్య మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. అన్నట్టు గతంలో నమ్రత – అనిల్ కపూర్ ఒక సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుండే వారి మధ్య స్నేహ బంధం ఉందట. ఇక పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కోసం నమ్రత కూడా క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తోంది.

అందుకే మొదటి నుండి ఈ సినిమా విషయంలో ఆమె ప్రమేయం కాస్త ఎక్కువుగానే ఉందట. ప్రతి విషయంలో ఆమె ఇన్ వాల్వ్ అవుతుందట. అది కాస్త ఇప్పుడు పరుశురామ్ బాగా ఇబ్బందిగా ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉన్నా.. సినిమా పూర్తి అయ్యేలోపు బయటకు పొక్కుతుంది అనుకోండి. ఇక భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ అయిన అనిల్ కపూర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ సినిమాలో పాత్రలకు సంబంధించి అనేక ఊహాగానాలు ఇంకా వస్తూనే ఉండటంతో చిత్ర యూనిట్ కి చికాకు తెప్పిస్తోందట. ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి. అన్నట్లు ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.