Homeఎంటర్టైన్మెంట్Gautham Krishna Debut: గౌతమ్ కృష్ణ కోసం కథలను ఫైనల్ చేస్తున్న నమ్రత...

Gautham Krishna Debut: గౌతమ్ కృష్ణ కోసం కథలను ఫైనల్ చేస్తున్న నమ్రత…

Gautham Krishna Debut: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. పాన్ ఇండియా హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇప్పుడు తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ ను సైతం ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం వివిధ దర్శకులు చెప్పిన కథలను కూడా విన్నారట. మొత్తానికైతే నమ్రత మహేష్ బాబు చేయాల్సిన సినిమా కథలను వింటూనే గౌతమ్ కృష్ణ ను హీరోగా లాంచ్ చేయడానికి ఎలాంటి కథ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక వాళ్ళ చేత కొన్ని కథలను కూడా రాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకి గౌతమ్ కృష్ణ ను ఇంట్రడ్యూస్ చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. కానీ మొత్తానికైతే ఆయన మరో రెండు సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ఇక ఇప్పటికే మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఆయన కూడా స్టార్ హీరోగా మారే అవకాశాలైతే ఉంటాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం తనను తాను హీరోగా నిలబెట్టుకోవడం కొంత వరకు కష్టమవుతుందనే చెప్పాలి… ఇక రాబోయే రోజుల్లో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ముఖ్యంగా గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భారీ హైప్ క్రియేట్ అవ్వడమే కాకుండా గౌతమ్ ను నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో దర్శకనిర్మాతలు భారీ ఎక్స్పరిమెంట్స్ చేసే అవకాశం కూడా ఉంది… ఘట్టమనేని ఫ్యామిలీ ని సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మహేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు. మహేష్ తర్వాత ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే మూడో తరం హీరో ఎవరు అనే విషయంలోనే సరైన క్లారిటి రావాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular