OTT: టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిలదొక్కుకుని ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో నాగశౌర్య. చిన్న చిన్న సినిమాలతోనే మంచి ఫేమ్ తెచ్చుకుని.. విభిన్న కథాంశాలతో ప్రక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కాకా, నాగశౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. ఈ సినిమా అక్టోబరు 29న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్గా నిటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాలో నాగశైర్య యాక్టింగ్కి మంచి మార్కులే పడ్డాయి. విమర్శకుల నుంచి కూడా మంచి టాక్ తెచ్చుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

ఈ సినిమా జీ5లో జనవరి 7న స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఇందులో నాగశౌర్య ఆకాశ్ పాత్రలో కనిపించగా.. రీతూవర్మ భూమిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
మరోవైపు నాగశౌర్య హీరోగా తాజాగా వచ్చిన లక్ష్య సినిమా డిసెంబరు 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. స్పోర్ట్స్ డ్రామా కథతో వచ్చిన ఇందులో కేతిక రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.