https://oktelugu.com/

Akkineni Nagarjuna : నాగ చైతన్య, శోభిత పెళ్లి ఏర్పాట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ నాగార్జున షాకింగ్ కామెంట్స్!

పెళ్లి ఏర్పాట్ల గురించి నాగ చైతన్య తండ్రి నాగార్జున , ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 09:42 PM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna :  నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల జంట పెళ్లి వచ్చే నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సంప్రదాయాలను తూచా తప్పకుండ అనుసరిస్తూ, ఈ వివాహ మహోత్సవం జరగనుంది. ఇప్పటికే ఈ జంట పెళ్లి పనుల్లో క్షణం తీరిక లేకుండా, ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనేదే పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత, నాగ చైతన్య, శోభిత ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి. సమంత పాట అలంటికి వార్తలు బయటకి రాలేదు. కేవలం నాగ చైతన్య గురించి మాత్రమే ఇలాంటి వార్తలు ప్రచారం అవుతుందేలోపు సమంత అభిమానులు ఉద్దేశపూర్వకంగా నాగ చైతన్య పై ఆరోపిస్తున్నారని అక్కినేని అభిమానులు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు.

    కానీ ఈ ఏడాది ఆగష్టు 8 వ తారీఖున వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకొని సోషల్ మీడియా లో పెట్టగానే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత వీళ్లిద్దరి ప్రేమ ఎలా మొదలైంది, పెళ్లి దాకా ఎలా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో వందల కథనాలు వచ్చాయి కానీ, వాటిల్లో ఏది నిజం లేదు. వీళ్లిద్దరు ఏదైనా ఇంటర్వ్యూ లో వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనే విషయం చెప్పినప్పుడే మనకి అసలు విషయం తెలియాలి. అప్పటి వరకు ఎవరి కథనాలు వారివి. ఇదంతా పక్కన పెడితే పెళ్లి ఏర్పాట్ల గురించి నాగ చైతన్య తండ్రి నాగార్జున , ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ ప్రతీ తండ్రికి ఉన్నట్టుగానే, నా కొడుక్కి కూడా వివాహం అంగరంగ వైభవంగా జరిపించాలని ఉంటుంది. కానీ నాగ చైతన్య, శోభిత ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా, చాలా సింపుల్ గా, అన్నపూర్ణ స్టూడియోస్ లోని 42 ఎకరాల్లో పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేసి, కేవలం 300 మంది బంధు మిత్రులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషుల మధ్య పెళ్లి చేసుకుంటే చాలు. గ్రాండ్ గా చేసుకోవాలని కోరిక లేదు అన్నారు. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి అని వాళ్ళకే వదిలేసాను. పెళ్లి ఏర్పాట్లు కూడా వాళ్లిద్దరే చూసుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే, చందు మొండేటి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘తండేల్’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల