https://oktelugu.com/

Hero Ram : కార్తీ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనున్న హీరో రామ్, మహేష్ బాబు కాంబినేషన్ చిత్రం?

తన తదుపరి చిత్రాన్ని 'మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి' దర్శకుడు పీ మహేష్ బాబు తో చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే మొదలు కాగా, మూవీ టీం కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ సైకిల్ ని పట్టుకొని పోతూ ఉంటాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 09:50 PM IST

    Karthi's super hit Film

    Follow us on

    Hero Ram: స్టార్ హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న యంగ్ హీరోలలో ఒకరు రామ్ పోతినేని. ‘దేవదాసు’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఈయన కెరీర్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు ఉన్నాయి. ఫలితంగా ఈయనకి యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదిరిపోయేవి. కానీ ఈమధ్య కాలంలో రామ్ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రావడం లేదు. చేస్తున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొడుతున్నాయి. ఆయన గత రెండు చిత్రాలు ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ డిజాస్టర్స్ గా నిలిచాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్కంద కి బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ మాత్రం రామ్ తన కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఫుల్ రన్ లో కనీసం 10 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టలేకపోయింది ఈ సినిమా.

    అందుకే ఈసారి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తన తదుపరి చిత్రాన్ని ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ దర్శకుడు పీ మహేష్ బాబు తో చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే మొదలు కాగా, మూవీ టీం కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ సైకిల్ ని పట్టుకొని పోతూ ఉంటాడు. ఒక వ్యక్తిని కలవడానికి చేసే ప్రయాణాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఇందులో రామ్ తో పాటుగా ఒక సీనియర్ హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది. రీసెంట్ గానే ఆయనని కలిసి స్టోరీ వినిపించగా, దానికి ఆ సీనియర్ హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి నటించిన ‘సత్యం..సుందరం’ చిత్రం గుర్తుకొస్తుంది.

    ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోలు ఉంటారు. రామ్ చేయబోతున్న సినిమాలో కూడా మరో హీరో ఉన్నాడు. కాన్సెప్ట్ పోస్టర్ ని చూస్తే అందరికీ ‘సత్యం..సుందరం’ చిత్రం గుర్తుకొచ్చింది. స్టోరీ లైన్ కూడా అదే విధంగా ఉంది. చూస్తుంటే ఆ సినిమానే తెలుగు లో రీమేక్ చేస్తున్నారా అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ‘సత్యం..సుందరం ‘ చిత్రం ఒక అందమైన మధుర జ్ఞాపకం. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాని ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, హృదయానికి హత్తుకునేలా చేస్తాయి. రామ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా అలా ఫీల్ గుడ్ సినిమాలాగా నిలిస్తే చాలని రామ్ అభిమానులు కోరుకుంటున్నారు.