Naga Chaitanya- Samantha: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగ చైతన్య జంట..నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంట, ఏడాది క్రితం వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల విడిపోవాల్సి వచ్చింది..ప్రేమ జంట అంటే ఇలాగె ఉండాలి..దాంపత్యం అంటే ఇదే రేంజ్ లో ఉండాలని వీళ్ళని చూసి చాలా మంది ఆదర్శంగా కూడా తీసుకున్నారు..కానీ అనుకోని విధంగా వీళ్లిద్దరు విడిపోవడం కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.

వీళ్ళిద్దరిని కలపడానికి అక్కినేని ఫామిలీ వారు ఎంత ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది..అంతలా ప్రేమించుకున్న ఈ జంట ఎందుకు విడిపోయింది అనేది ఎవరికీ తెలియదు కానీ,సోషల్ మీడియా లో ఉండే వెబ్ సైట్స్ మాత్రం ఎవరికీ తోచినట్టు వారు ఊహాగానాలు ప్రచురితం చేసారు..అయితే ఇప్పుడు తాజాగా ఒక వార్త అక్కినేని మరియు సమంత అభిమానుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే సమంత మరియు నాగ చైతన్య కలిసి నటించిన ‘మజిలీ’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం అటు సమంత కి కానీ, ఇటు నాగ చైతన్య కి కానీ ఎంతో ప్రత్యేకం..ఎందుకంటే పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది..అలాంటి సినిమాకి సీక్వెల్ ని నిర్మించడానికి అక్కినేని నాగార్జున సన్నాహాలు చేస్తున్నాడట..అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రం లో మళ్ళీ సమంతానే హీరోయిన్ గా తీసుకోవాలని నాగార్జున గట్టి ప్రయత్నం చేస్తున్నాడట..ఎలా అయినా వీళ్ళిద్దరిని ఈ సినిమా తో కలపాలని చూస్తున్నాడు..అయితే నాగ చైతన్య కి సమంత తో కలిసి నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ,సమంత కి మాత్రం బాగా ఇబ్బందిగానే ఉంటుంది అనే చెప్పాలి..ఎందుకంటే కొద్దీ రోజుల క్రితం ఆమె బాలీవుడ్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో పాల్గొన్న సంగతి మన అందరికి తెలిసిందే.
ఈ షో ని చూస్తే ఆమెకి నాగ చైతన్య అంటే ఎలాంటి కోపం ఉందొ అర్థం అవుతుంది..కానీ నాగార్జున అంటే ఆమెకి ఎంతో గౌరవం..ఆయనని గౌరవించి సమంత ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.