Akkineni Nagarjuna : కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన లెజెండ్స్ కి సంబంధించిన బయోపిక్స్ ని వెండితెర మీద ఆవిష్కరిస్తే అద్భుతమైన ఫలితాలు రావడం ఇది వరకు మనం చాలానే చూసాము. మహానటి సావిత్రి బయోపిక్ ని ‘మహానటి’ పేరుతో సినిమా తీయగా, ఎంతటి సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా క్రికెట్ లెజెండ్ ధోని బయోపిక్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆడియన్స్ కూడా కొంతమంది లెజెండ్స్ బయోపిక్స్ ని సినిమా రూపం లో చూడాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అలా వాళ్ళు కోరుకుంటున్న లెజెండ్ బయోపిక్స్ లో ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారిది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఊపిరి ఊదిన దిగ్గజ మహా నటులలో ఒకరు ఆయన. టాలీవుడ్ కి ఒక కన్ను ఎన్టీఆర్ అయితే, మరో కన్ను ఏఎన్నార్. అలాంటి మహానుభావుడి బయోపిక్ ని చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.
అయితే తన తండ్రి ఏఎన్నార్ బయోపిక్ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గోవా లో ఇటీవలే IFFI వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నాడు. ఆయన తండ్రి నాగేశ్వరరావు గారు కళామ్మ తల్లికి చేసిన సేవలను స్మరించుకుంటూ ‘సెంటినరీ స్పెషల్ ఏఎన్నార్ : సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న నాగార్జున ఏఎన్నార్ బయోపిక్ గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘నాన్నగారి బయోపిక్ ని సినిమాగా తీయమని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో నన్ను అడుగుతూ ఉన్నారు. నా అభిప్రాయం ఏమిటంటే నాన్న గారి బయోపిక్ ని సినిమాగా తీయడం కంటే, డాక్యుమెంటరీ గా తీయడం ఉత్తమం అని అంటాను. ఎందుకంటే నాన్నగారి జీవితం లో దారుణమైన పరాజయాలు చూసింది చాలా తక్కువ. ఆయన జీవితం మొత్తం హై లోనే ఉంటుంది. ఒక సినిమాలో ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కేవలం ఎదుగుదలకు సంబంధించిన సందర్భాలను చూపిస్తే చాలా బోర్ కొడుతోంది. ఎదుగుదలతో పాటు ఒడిదుడుకులు చూపిస్తేనే ఎమోషన్స్ పండుతాయి. మహానటి సక్సెస్ అవ్వడానికి కారణం అదే. నాన్న గారి జీవిత చరిత్రలో ఒడిదుడుకులు లేవు కాబట్టి, సినిమాగా వర్కౌట్ అవ్వదు. డాక్యుమెంటరీ గా తీసి కొన్ని కల్పితాలు చేస్తే వర్కౌట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇందులో ధనుష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.
“To be honest, an #ANR biopic might feel boring, as his life was mostly a series of highs. For a biopic, you need both ups and downs, along with some fictionalization.
Instead, we’ll create a documentary on ANR, with ANR portraying himself.”
– #Nagarjuna #GulteExclusive… pic.twitter.com/ywwG7944xO
— Gulte (@GulteOfficial) November 23, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Nagarjunas interesting comments about the anr biopic have now gone viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com