https://oktelugu.com/

Naga Chaitanya And Sobhita: పురోహితుడితో నాగార్జున మంతనాలు.. నాగ చైతన్య, శోభిత పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్..అసలు ఏమైందంటే!

ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్ కి ఫిర్యాదు కూడా చేసింది. వేణు స్వామి పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. కాస్త సీరియస్ గా తీసుకుంటే అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 09:05 PM IST

    Sobhita And Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya And Sobhita: అక్కినేని నాగచైతన్య,శోభిత దూళిపాళ్ల వివాహం వచ్చేనెలలో అన్నపూర్ణ స్టూడియోస్ లోని 22 ఎకరాలా స్థలంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిన పక్క రోజే వేణు స్వామి అనే ప్రముఖ జ్యోతిష్యుడు వీళ్లిద్దరు 2027 వ సంవత్సరంలో విడాకులు తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కినేని అభిమానులు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్ కి ఫిర్యాదు కూడా చేసింది. వేణు స్వామి పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. కాస్త సీరియస్ గా తీసుకుంటే అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి.

    ఇదంతా పక్కన పెడితే శుభమా అని పెళ్లి చేసుకోబోతున్న జంట గురించి ఇలాంటి అశుభమైన మాటలు మాట్లాడితే ఏ తండ్రికైనా కాస్త మనసులో ఎదో ఒక మూల భయం ఉంటుంది. పైగా నాగచైతన్య, సమంత విషయం లో వేణు స్వామి చెప్పింది నిజమైంది. ఆ భయం అక్కినేని కుటుంబ సభ్యులందరికీ ఉంది. అందుకే నాగార్జున రీసెంట్ గా ఒక ప్రముఖ జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి నాగ చైతన్య, శోభిత జాతకాలు చూపించాడట. వీళ్లిద్దరి జాతకాలు చూసిన తర్వాత చిన్న చిన్న దోషాలు తప్ప, బ్యాపడాల్సిన అవసరమే లేదని, ఈ జంట నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి జీవిస్తారని చెప్పాడట. దీంతో నాగార్జున మనసు కాస్త కుదుట పడిందట. ఒకవేళ వేణు స్వామి చెప్పినట్టే, ఈ జ్యోతిష్యుడు కూడా చెప్పి ఉండుంటే, వీళ్ళ పెళ్లిని నాగార్జున జరగనిచ్చేవాడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

    ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది. సుమారుగా 80 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసినట్టు సమాచారం. శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథని సిద్ధం చేయడానికి సుమారుగా మూడేళ్ళ సమయం తీసుకున్నాడట డైరెక్టర్.