అరవైకి దగ్గర్లో ఉన్నా టాలీవుడ్ మన్మధుడు అని పిలించుకోవాలని అక్కినేని నాగార్జున ఇప్పటికీ ఆశ పడుతూ ఉంటాడు. అందుకే ఈ వయసులో ఒక మంచి రొమాంటిక్ మూవీ చేయాలని తెగ ఉబలాట పడుతున్నాడు. ఈ క్రమంలోనే “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ ను ఫుల్ రొమాంటిక్ మూవీగా తీసుకువస్తున్నాడు. అయితే, గత రెండేళ్ల నుండి ఈ సినిమా పై రూమర్స్ తప్ప, సరైన అప్ డేటే లేదు.
మొత్తానికి ఇన్నాళ్ళకు క్లారిటీ వచ్చింది. బంగార్రాజు సినిమా చిత్రీకరణ ఆగస్టు 20 నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ కోసం వేసిన సెట్ లో ముందుగా నాగార్జున, రమ్యకృష్ణలపై కీలక సీన్స్ తెరకెక్కిస్తారట. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తోన్నాడు. చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి నటిస్తోంది.
‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. వచ్చే సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఎంతైనా అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది. అప్పటివరకు హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న కింగ్ కెరీర్ కి ఈ సినిమా పెద్ద బలాన్ని ఇచ్చింది.
ముఖ్యంగా బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ ఊపులోనే సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి నాలుగేళ్లు పట్టింది. కల్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి ‘బంగార్రాజు’ పరిస్థితి ఓ కొలిక్కి రావడంతో కింగ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nagarjunas bangarraju to go on floors in august 20th
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com