Naga Chaitanya: చైతుతో ‘శివ’ ట్రై చేసిన నాగ్.. ప్చ్ వర్కౌట్ కాలేదు !

Naga Chaitanya:అక్కినేని కుటుంబంలో మూడో తరం వారసుడు నాగ చైతన్య కెరీర్ బిగినింగ్ లో ఏమాయ చేశావే, 100% లవ్ వంటి హిట్స్ అందుకున్నాడు.ఈ చిత్రాలు ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మాస్ హీరోగా ఎదగాలని దడ, ఆటో నగర్ సూర్య వంటి చిత్రాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. చైతూ కెరీర్ లో హిట్ కొట్టిన చిత్రాలన్నీ దాదాపు, రొమాంటిక్ లవ్ జోనర్ లో తెరకెక్కినవే. తాజాగా లవ్ స్టోరీ మూవీతో మరో బంపర్ హిట్ […]

Written By: Shiva, Updated On : November 23, 2021 11:22 am
Follow us on

Naga Chaitanya:అక్కినేని కుటుంబంలో మూడో తరం వారసుడు నాగ చైతన్య కెరీర్ బిగినింగ్ లో ఏమాయ చేశావే, 100% లవ్ వంటి హిట్స్ అందుకున్నాడు.ఈ చిత్రాలు ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మాస్ హీరోగా ఎదగాలని దడ, ఆటో నగర్ సూర్య వంటి చిత్రాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. చైతూ కెరీర్ లో హిట్ కొట్టిన చిత్రాలన్నీ దాదాపు, రొమాంటిక్ లవ్ జోనర్ లో తెరకెక్కినవే. తాజాగా లవ్ స్టోరీ మూవీతో మరో బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

తన కంటూ సపరేట్ ఇమేజ్, స్టార్ డమ్, మార్కెట్ సాధించాడు నాగ చైతన్య. ఆయన నటించిన గత మూడు చిత్రాలు హిట్ కావడం విశేషం. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ విజయాలతో ఆయన హ్యాట్రిక్ కొట్టారు. కాగా 2009లో నాగ చైతన్యను వెండితెరకు పరిచయం చేసిన నాగార్జున… డెబ్యూ చిత్రంగా ఓ ఛాలెంజింగ్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.

చైతూ మొదటి చిత్రం ‘జోష్’ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది జోష్ సినిమా స్టోరీని గమనిస్తే నాగార్జున కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా మిగిలిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ ‘శివ’ గుర్తుకు వస్తుంది. కాలేజ్ స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ కి రాజకీయాలు, మాఫియా జోడించి రామ్ గోపాల్ తెరకెక్కించిన శివ అప్పట్లో ట్రెండ్ సెట్టర్.కొడుకు చైతూతో ఇదే తరహా సబ్జెక్టుతో జోష్ మూవీ చేశారు.

రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారి, కెరీర్ నాశనం చేసుకునే స్టూడెంట్స్ కి బుద్ధి చెప్పే విధంగా హీరో చైతూ రోల్ ఉంటుంది. సినిమాలో రొమాన్స్, లవ్ యాంగిల్ చాలా తక్కువ, యాక్షన్, పొలిటికల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది. శివ రేంజ్ హిట్ జోష్ సాధిస్తుందని, ఆశించడం అత్యాశే అవుతుంది. కనీస విజయం కూడా అందుకోకుండా, మూవీ ప్లాప్ కావడం నాగార్జునను నిరాశకు గురిచేసింది.

Also Read: Nithin: వెబ్​సిరీస్​వైపు నితిన్​ అడుగులు.. ఎలాంటి కథతో వస్తున్నారంటే?

జోష్ సినిమాకు వాసు వర్మ దర్శకత్వం వహించగా, ఆద్యంతం చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హీరో చైతూ, హీరోయిన్ కార్తీక లుక్స్ జనాలకు అసలు నచ్చలేదు. వారిద్దరికీ అది మొదటి చిత్రం, అలాగే ఇద్దరూ స్టార్ కిడ్స్. కార్తీక అలనాటి అందాల తార రాధ పెద్ద కూతురు.

పేరెంట్స్ అందంతో వాళ్ళ వారసులు చైతూ, కార్తీక లను పోల్చుకున్న జనాలు, నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే మొదటి చిత్రం ఫెయిల్ అయినా.. చైతూ రెండో చిత్రం ఏమాయ చేశావే తో హిట్ కొట్టాడు.

Also Read: JR NTR: ఆ ఇద్దరు డైరెక్టర్లతో ఎన్టీఆర్​ సినిమా.. ఫస్ట్ షూటింగ్​ మొదలయ్యే మూవీ ఏదంటే?

Tags