Anil Ravipudi: దర్శకుడిగా ఇది నాకు ఆరో పుట్టినరోజు- అనిల్​ రావిపుడి

Anil Ravipudi: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​- వరుణ్​ తేజ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం ఎఫ్​3. తమన్న, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు.  కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. సునీల్​ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.  కాగా, ఇవాళ అనిల్​ రావిపుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఈ సినిమా విశేషాలతో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 23, 2021 11:21 am
Follow us on

Anil Ravipudi: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​- వరుణ్​ తేజ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం ఎఫ్​3. తమన్న, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు.  కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. సునీల్​ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.  కాగా, ఇవాళ అనిల్​ రావిపుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఈ సినిమా విశేషాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

దర్శకుడిగా తనకు ఇది ఆరో పుట్టినరోజని అన్నారు అనిల్​, ఎఫ్​3 సెట్స్​లోనే తన పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయని అన్నారు. ఈ సినిమా విడుదలపై స్పందించిన ఆయన.. నా దర్శకత్వంలో వచ్చిన ఎఫ్​2, సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికే విడుదలయ్యాయి. ఎఫ్​3 కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. కానీ మిస్​ అయ్యింది.. కానీ సోలోగా ఎంట్రీ ఇస్తాం అని న్వువతూ అన్నారు. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 85 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని అన్నారు.

కాగా, చిన్నపిల్లలతో ఇంట్లో అనుభవించే ఎలిమెంట్స్​ అన్నీ ఎఫ్​3లో ఉంటాయని అన్నారు అనిల్​. థియేటర్లలో ఈ సినిమా చూసినప్పుడు అరే.. మా ఇంట్లో కూడా ఇదే ప్లాబ్లమ్స్ కదా అనుకుంటారని అన్నారు. ఇక ఎఫ్​2 తన బయోపిక్​ అని.. ఇంకా చెప్పాలంటే మొగాళ్లందరి బయోపిక్​ అని అన్నారు. మరోవైపు, ఈ సినిమాలో హీరోలుగా నటించిన వరుణ్​, వెంకీల మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. ఈ సినిమాలో దాదాపు 35 మంది ప్రధాన పాత్రలో నటిస్తున్నారని అన్నారు.  కాగా, ఇటీవల వెంకీ ఎఫ్​3 ఫస్ట్​ఆఫ్​ చూసి.. సినిమాలో నేనొక్కడినే బాగా చేశాననుకున్నా.. అందరూ ఇరగ్గొట్టేశారు అన్నారని తెలిపారు. అనిల్​.