Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వీకెండ్ కావడంతో స్పెషల్ గెస్ట్ గా హీరో నాని ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. నేటి ప్రోమోలో నాని స్టేజి పై నాగార్జున బదులుగా మోడల్స్ తో స్టెప్స్ వేసాడు. నాగార్జున వెనుక నుంచి వచ్చి ‘హాయ్ నాన్నా’ .. ఏంటి ఇక్కడ .. ఇది సీజన్ 7 .. సీజన్ 2 కాదు అంటూ పంచ్ వేశారు. అందుకే సార్ గ్యాప్ ఇచ్చా .. అని నాని అన్నాడు. నువ్వు నాన్న కాదు .. నాని కాదు .. నువ్వు నా దాస్ వి .. నేను నీ దేవాని అంటూ దేవదాస్ సినిమాని గుర్తు చేసుకున్నారు.
ఇక నాని తన కొత్త సినిమా గురించి చెప్పుకొచ్చాడు. తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ ని పరిచయం చేసాడు. ముందుగా అర్జున్ ని పరిచయం చేస్తూ ‘ తన అసలు పేరు అంబటి నాగార్జున అని అనగానే నాని ఈ సీజన్ గనుక మీరు గెలిస్తే హోస్ట్ నాగార్జున .. విన్నర్ నాగార్జున అని అన్నాడు. దీంతో అర్జున్ ‘ అదే జరగాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ అన్నాడు. తర్వాత అమర్ లవ్ స్టోరీ గురించి పంచులు వేస్తూ ఏడిపించారు నాగార్జున.
తర్వాత ప్రియాంక గురించి ఒక విషయం చెప్పాలి అంటూ ‘ నాని నీకు టేబుల్స్ వచ్చా అని అడిగారు నాగ్. కొంచెం కొంచెం వచ్చు అని నాని చెప్పాడు. నాలుగు ఇంటూ ఎనిమిది ఎంత అని అడిగారు. 32 అని చెప్పాడు నాని. దీంతో నాగార్జున ‘ మా ప్రియాంక ఎంత చెప్పిందో నీకు ఒక వీడియో చూపిస్తా అంటూ శోభా, ప్రియాంక లు టాస్క్ రింగ్స్ లెక్కపెడుతున్న వీడియో చూపించారు.
అంధులో వాళ్ళు నాలుగు ఇంటూ ఎనిమిది .. 48 అని చెప్పారు. ప్రియాంక లెక్కలు చూసి షాక్ అయ్యాడు నాని. మీ గురించి ఇంకా చెప్పక్కర్లేదు .. నాకు క్లారిటీ వచ్చేసింది అని ప్రియాంక తో అన్నాడు నాని. దాంతో ప్రియాంక మొహం మాడిపోయింది. ఇక చివర్లో యావర్ కి తెలుగు రాదు అని నాగార్జున చెప్పడంతో .. కాసేపు యావర్ తో తెలుగులో మాట్లాడిస్తూ ఆడుకున్నాడు నాని. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో ఆకట్టుకుంది.
Today’s promo 1#Nani tho fun and entertainment ee sari.#BiggBossTelugu7 pic.twitter.com/BOhrpSd5Yt
— BiggBossTelugu7 (@TeluguBigg) December 3, 2023