https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: హౌస్లో పాము ఎవరో తేల్చేసిన నాగార్జున, శివాజీని బయటకు నిర్ణయం అతనిదే!

శివాజీ అన్న ఒక్కొక్క సారి మాటలు వదిలేస్తాడు. కామెడీ గా అంటారు కానీ ఆ మాటలు హర్టింగ్ గా అనిపిస్తాయి అని చెప్పాడు గౌతమ్. ఆ తర్వాత శివాజీ... ప్రిన్స్ యావర్ ను నిచ్చెన అని చెప్పి ,అమర్ ను పాము అని చెప్పాడు.

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2023 / 09:48 AM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. వీకెండ్స్ అయితే మరీ స్పెషల్ నాగార్జున వస్తారు. కంటెస్టెంట్స్ చేసిన తప్పులకి వార్నింగ్ ఇవ్వడంతో పాటు,ఫన్నీ గేమ్స్ పెట్టి సందడి చేస్తారు. ఈ రోజు వీకెండ్ కావడంతో ఫుల్ జోష్లో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.అయితే శోభా పేరు టాటూ వేయించుకోవాలి అంటూ తేజను ఇరికించే ప్రయత్నం బిగ్ బాస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి ప్రస్తావించారు నాగార్జున. తేజ, సందీప్ కత్తితో శోభా పేరు టాటూ వేసేద్దాం అని అన్నాడు.

    దీంతో తేజ తన స్టైల్ లో జవాబిచ్చి కామెడీ పండించాడు.ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి వైకుంఠపాళి ఆట పెట్టాడు నాగార్జున. ముందుగా అశ్విని తో నీకు ఈ ఇంట్లో నిచ్చెన ఎవరు పాము ఎవరో చెప్పమని అడిగారు. గౌతమ్ నిచ్చెన,శోభా పాము అని చెప్పింది. నేనేం మాట్లాడినా తప్పు అర్థాలు తీసుకుంటుంది అని అశ్విని చెప్పింది. ఇక ఆ తర్వాత గౌతమ్ అర్జున్ ని నిచ్చెన శివాజీ పాము అని చెప్పాడు.

    శివాజీ అన్న ఒక్కొక్క సారి మాటలు వదిలేస్తాడు. కామెడీ గా అంటారు కానీ ఆ మాటలు హర్టింగ్ గా అనిపిస్తాయి అని చెప్పాడు గౌతమ్. ఆ తర్వాత శివాజీ… ప్రిన్స్ యావర్ ను నిచ్చెన అని చెప్పి ,అమర్ ను పాము అని చెప్పాడు. మనోడు స్టార్టింగ్ నుంచి నా మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకుని ఉన్నాడు. నువ్వు ఆడలేదు వేరే వాళ్ళు బాగా ఆడారు అంటాడు అని శివాజీ అనగానే ఆ ప్లేస్ లో మీరు ఉన్న అలాగే చేస్తారు అని బదులిచ్చాడు అమర్.

    దీనికి శివాజీ ‘నేను అలా చెయ్యను,చచ్చినా చెయ్యను అని అన్నాడు.దాని తర్వాత అమర్ … తేజ ను పాము అని చెప్పి,మనోడు కదా ఇది చేస్తాడు కదా అనుకునే టైమ్ కి వాడి అవసరం గుర్తొచ్చి వేరేవాళ్లకి వేసేస్తాడు సార్ అని అమర్ నాగార్జున తో చెప్పాడు. దీనికి తేజ నేను అమర్ కి రెండు గుడ్లు ఇచ్చాను సార్ అనగానే నాగ్ గుడ్లు ఇస్తే నిచ్చెన లాగా నిలుస్తావా అని ప్రశ్నించాడు. అంటే నేను ప్రోటీన్ ఇచ్చాను సార్ అంటూ జోకులు పేల్చాడు తేజా. మెజారిటీ ఇంటి సభ్యుల అభిప్రాయం ప్రకారం శివాజీని నాగార్జున పాముగా తేల్చేశాడు. అనంతరం శివాజీ ఆరోగ్యం గురించి అడగ్గా చేయి నొప్పిగా ఉంటుందని చెప్పాడు. ఫిజియో చేపిస్తాము. అప్పుడు కూడా తగ్గకపోతే బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడని చెప్పాడు.

    ఇక శనివారం నాగార్జున కొందరిని హెచ్చరించాడు. కేక్ విషయంలో ఫ్రాంక్ చేశాడు. అనుమతి లేకుండా కేక్ తిని తప్పు చేశావ్. దీనికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. దాంతో అమర్ భయపడి పోయాడు. తేజా, శోభాలను కూడా నాగార్జున భయపెట్టారు. అనంతరం ఫ్రాంక్ అంటూ అమర్ దీప్ ఈ వారం బాగా ఆడావు అంటూ పొగిడారు. బూతులు మాట్లాడిన భోలేని కూడా నాగార్జున హెచ్చరించాడు. మాట జారీ క్షమాపణలు చెప్పినా ప్రయోజనం ఉండదు అన్నాడు. అయితే భోలే ముందు థూ అని ఊసిన ప్రియాంకను నాగార్జున తప్పుబట్టాడు.

    అలాగే ఊరోడు అని సందీప్ అన్నాడని ఆరోపణలు చేసిన ప్రశాంత్ ని కూడా నాగార్జున తప్పుబట్టాడు. సందీప్ ఊరోడు అనలేదని తేలింది. ఆరోపణ చేసే ముందు ఆలోచించి చేయాలి ప్రశాంత్ అని నాగార్జున కోప్పడ్డారు. ఒక వేళ ఊరోడు అన్నా కూడా అందులో తప్పేముంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఊరోడే. మా నాన్న కూడా ఊరోడే. ఊరు లేకపోతే తిండి లేదు, పట్టణాలు, నగరాలు లేవన్నాడు. ఇక ఈవారం కెప్టెన్ గా అర్జున్ గెలిచాడు.