Nagarjuna And Rajamouli: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లకు చాలా మంచి గుర్తింపు ఉండేది… వాళ్ళిద్దరిని ఇండస్ట్రీ కి రెండు కండ్లుగా అభివర్ణిస్తుంటారు. వాళ్ళిద్దరు లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉండేది కాదని, తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు… ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ జంచింసైతం నాగేశ్వరరావు తర్వాత నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ అయిన కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు…గత కొద్ది రోజుల నుంచి సోలో హీరోగా నాగార్జున నుంచి ఒక్క సినిమా కూడా రావడం లేదు… రీసెంట్ గా కుబేర, కూలీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప అభిమానులను సంపాదించి పెట్టాయి… ప్రస్తుతం నాగార్జున 100 వ సినిమా మీద కొంతమంది కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే..? తెలుగు లో అంత మంది స్టార్ డైరక్టర్లు ఉండగా నాగార్జున తమిళ్ డైరెక్టర్ తో వందోవ సినిమా చేయడం ఏంటి? అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి… ఇక ఇదిలా ఉంటే నాగార్జున కార్తీక్ దర్శకత్వం లో సినిమా చేయడానికి అసలు కారణం రాజమౌళి అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది….
అసలు విషయంలోకి వెళ్తే నాగార్జున వందోవ సినిమా దర్శకుడు అయిన కార్తీక్ రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ కి ఫ్రెండ్ అవ్వడంతో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది…అయితే మొదట కార్తీక్ చెప్పిన కథలో ఎమోషన్ ప్రాపర్ గా లేదని నాగార్జున దాన్ని రిజెక్ట్ చేశాడు. అప్పుడు రాజమౌళి రంగులోకి దిగి అందులో కొన్ని సీన్స్ మార్చి నాగార్జున ఒప్పుకునేలా చేశాడట…
ఇక ఈ సినిమా వెనక రాజమౌళి నేను ఉంటానని చెప్పడంతో నాగార్జున ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట…ఇక గతంలో నాగార్జున రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో ‘రాజన్న’ అనే సినిమా చేశాడు. అప్పుడు కూడా రాజమౌళి ఆ సినిమాలో ఫైట్స్ నేను చేస్తాను అని చెప్పడంతో నాగార్జున ఆ సినిమా ను ఒప్పుకున్నాడు…
అయితే ఆ సినిమా అంటున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు అంటూ పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక ఒకసారి రాజమౌళిని నమ్మి బొక్క బోర్ల పడ్డ నాగార్జున తన వందో సినిమా విషయంలో కూడా అలానే చేయడం తన అభిమానులకు నచ్చడం లేదు… మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…