Bigg Boss 8 Telugu Finale LIVE : ఈ సీజన్ బిగ్ బాస్ ఫినాలే ముందు సీజన్స్ తో పోలిస్తే ది బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముందు జరిగిన సీజన్స్ ఎలా ఉన్నా, ఫినాలే ని మాత్రం ది బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేసారు బిగ్ బాస్ టీం. ముఖ్య అతిథి గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని పిలవడం దగ్గర నుండి, పాత కంటెస్టెంట్స్ తో నాగార్జున సరదాగా మాట్లాడడం, అదే విధంగా టాప్ 5 కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబాలతో జరిపిన సంభాషణ కాస్త ఫన్ తో పాటు ఎమోషనల్ గా అనిపించింది. ముఖ్యంగా నిఖిల్ తన అమ్మగారితో జరిపిన సంభాషణ చాలా ఎమోషనల్ గా అనిపించింది. హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ పై అనేక నిందలు పడిన సంగతి తెలిసిందే. ఈ నిందలు తన కుటుంబ సభ్యులు ఎలా తీసుకుంటారో అని అతనిలో భయం ఉండేది.
కానీ ఎప్పుడైతే అతని తల్లి నిన్ను, నీ ప్రవర్తన, నీ ఆట తీరుని చూసి గర్వ పడుతున్నాను అని చెప్పిందో, అప్పుడే నిఖిల్ కళ్ళలో నుండి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి. ఇక ఆ తర్వాత గౌతమ్ తండ్రి గౌతమ్ తో మాట్లాడుతూ ‘అశ్వథామ 3.0 ‘ అని అంటాడు. అప్పుడు నాగార్జున ఆయనతో మాట్లాడుతూ బిగ్ బాస్ కి వెళ్లోద్దని గొడవ పడ్డారట కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అని అడుగుతాడు. దానికి గౌతమ్ తండ్రి సమాధానం చెప్తూ ‘చాలా గర్వంగా ఉంది సార్. చివరి దాకా వెళ్లి వచ్చాడు పోయినసారి, అందుకే మళ్ళీ సమయం వృధా చేయడం ఎందుకు అని వద్దు అన్నాను. కానీ హౌస్ లో వాడు ఆడిన ఆట తీరుని చూసి చాలా గర్వంగా అనిపించింది’ అని అంటాడు. ఆ తర్వాత ఆయన గౌతమ్ తో మాట్లాడుతూ ‘నాగార్జున సార్ ఎప్పుడైతే అశ్వథామ ఈజ్ బ్యాక్ అన్నాడో, ఆరోజే నీ టైం స్టార్ట్ అయిపోయింది’ అని అంటాడు.
ఆ తర్వాత టేస్టీ తేజ గురించి గౌతమ్ తండ్రి మాట్లాడుతూ ‘వీడు మాటికొస్తే నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తాడు, ఎవడురా నీకు అంకుల్ అని అన్నాను’ అని అంటాడు. ఆ తర్వాత తేజ మైక్ అందుకొని ‘అంటే ఆయన దృష్టిలో గౌతమ్ కి తమ్ముడు లాగ ఉన్నాను, నేను ఎలా అంకుల్ ని అవుతాను అని సార్’ అంటాడు తేజ. అలా వీళ్ళ మధ్య సరదాగా సంభాషణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున గౌతమ్ తండ్రి తో మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. మీరు ఏది చెప్పాలి అనుకుంటున్నారో, అది చెప్పేస్తారు, అవతల వాళ్ళని పట్టించుకోరు, ఇదే లక్షణం మీ అబ్బాయి కి కూడా వచ్చింది’ అని అంటాడు. అప్పుడు గౌతమ్ అవును సార్, మ్యానుఫ్యాచర్ డిఫెక్ట్ , నాకు అదే లక్షణం వచ్చింది అని అంటాడు. అలా వీళ్ళ మధ్య సంభాషణ సరదాగా సాగిపోయింది.