Nagarjuna Akkineni : ఈ మధ్యకాలంలో ఎవ్వరి నోట విన్న ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు శోభిత ధూళిపాల. ఇటీవల డిసెంబర్ నాలుగున అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పెళ్లికూతురు గెటప్ లో శోభితా ధూళిపాల ఫోటోలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాల వివాహం కుటుంబ సభ్యులు మరియు కొద్దిపాటి సెలబ్రిటీల మధ్య చాలా ఘనంగా జరిగింది. అయితే శోభిత ధూళిపాల మరియు అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల అక్కినేని నాగార్జున తన కోడలు శోభితా ధూళిపాల గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన కోడలు శోభితా ధూళిపాల గురించి మాట్లాడుతూ అక్కినేని నాగార్జున నాగ చైతన్య తో పరిచయానికి ముందే శోభితా ధూళిపాల తనకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో తన కోడలు శోభిత దూళిపాల గురించి మాట్లాడుతూ నాగార్జున ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. తన కోడలి వ్యక్తిత్వం, పనిలో నిజాయితీని అక్కినేని నాగార్జున కొనియాడారు. శోభిత ధూళిపాల పనిలో క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్తారని నాగార్జున తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. నాగచైతన్య జీవితంలోకి శోభిత ధూళిపాల వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నానని నాగార్జున చెప్పుకొచ్చారు.
వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అని ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే అక్కినేని నాగచైతన్య శోభితతో పెళ్లికి ముందు హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య మరియు సమంత ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ పెద్దలను ఒప్పించి 2017లో చాలా గ్రాండ్ గా సినిమా సెలబ్రిటీలు, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల చేత నాగచైతన్య, సమంత 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు.
విడిపోయిన తర్వాత నాగచైతన్య మరియు సమంత ఎవరికివారు తమ సినిమా షూటింగ్లలో బిజీగా అయిపోయారు. ఇక సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య కు శోభిత దూళిపాలతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 8న నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల నిశ్చితార్థం కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఇదే ఏడాది డిసెంబర్ 4న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. నాగ చైతన్య,శోభిత ధూళిపాళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.