Nagarjuna On NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆది , సింహాద్రి లాంటి సినిమాలతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. వాళ్ల బాబాయ్ అయిన బాలయ్య కి ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో, అంతటి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో అప్పుడున్న యంగ్ హీరోలందరిలో తనే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే సింహాద్రి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఒక ఫంక్షన్ లో నాకు చిరంజీవి ఎవరో తెలియదు అని మాట్లాడినట్టు గా అప్పట్లో మీడియా లో చాలా వార్తలు అయితే వచ్చాయి. ఇక దాంతో ఆ విషయం తెలుసుకున్న నాగార్జున ఎన్టీఆర్ ను కలిసి ఆయనతో మాట్లాడి ఇండస్ట్రీ లో ఒకటి, రెండు సక్సెస్ లు వచ్చినంత మాత్రాన మనం పెద్ద తోపులం కాదు , సీనియర్లకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలి.
అంతే తప్ప ఇక్కడ ఎవరూ స్టార్ హీరోలు కాదు, ఒకరోజు ఒకరు స్టార్ గా ఉంటే, మరొక రోజు మరొకరు స్టార్ హీరోలుగా వెలుగొందుతారు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు అని నాగార్జున ఎన్టీఆర్ కి చాలా స్ట్రాంగ్ గా చెప్పాడట. దాంతో ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్టీయార్ ఎవరి గురించి కూడా పెద్దగా కామెంట్లు చేయడం లేదు.
20 సంవత్సరాలకే స్టార్ హీరో అయిపోవడంతో ఎన్టీఆర్ కి అప్పుడు సరైన మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే అలాంటి మాటలు మాట్లాడాడు అంటూ చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇక దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో చాలా డీసెంట్ గా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా తన సినిమాలు తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ధృడ సంకల్పం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక ఎన్టీఆర్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.