https://oktelugu.com/

Akkineni Akhil- Rajamouli: అఖిల్ ని రాజమౌళి చేతిలో పెట్టిన నాగార్జున.. ఎన్ని కోట్ల రూపాయిలు అడ్వాన్స్ ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ముహూర్తం సరిగా లేదు అనుకుంట. అందుకే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్ సినిమా కూడా లేదు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఏజెంట్' చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ కి అర్జెంటు గా ఒక సూపర్ హిట్ కావాలి.

Written By:
  • Vicky
  • , Updated On : May 16, 2023 / 07:48 AM IST

    Akkineni Akhil- Rajamouli

    Follow us on

    Akkineni Akhil- Rajamouli: అక్కినేని ఫ్యామిలీ నుండి భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీ లోకి లాంచ్ అయిన హీరో అక్కినేని అఖిల్. మొదటి సినిమా ‘అఖిల్ – ది పవర్ ఆఫ్ జువ్వ’ చిత్రానికి స్టార్ హీరో రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అక్కినేని కుటుంబం నుండి మూడవ తరం లో ఒక స్టార్ హీరో గా అఖిల్ నిలవబోతున్నాడు అనే నమ్మకాన్ని ఇచ్చాడు.

    కానీ ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ముహూర్తం సరిగా లేదు అనుకుంట. అందుకే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్ సినిమా కూడా లేదు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ కి అర్జెంటు గా ఒక సూపర్ హిట్ కావాలి.

    అందుకోసం ఆయనకీ కచ్చితంగా సూపర్ హిట్ ఇచ్చే డైరెక్టర్ కావాలి. ఇన్ని రోజులు అఖిల్ ని తన ఇష్టానికి వదిలేసినా నాగార్జున ఇప్పుడు కొడుకు జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. రీసెంట్ గానే దర్శక ధీరుడు రాజమౌళి ని కలిసి అఖిల్ తో ఒక సినిమాని సెట్ చేసాడట నాగార్జున. ఇందుకోసం రాజమౌళి కి పది కోట్ల రూపాయిల అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చాడట.

    ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా గడిపేస్తున్నాడు.ఈ ఏడాది లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి అఖిల్ తో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్, ఇదే కనుక నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తారు, ఈ వార్త అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.