Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి విభిన్నమైన పాత్రలను పోషించి నాగార్జున తనని తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన రా కార్తీక్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఎందుకని నాగార్జున తమిళ్ డైరెక్టర్ లను ఎంచుకుంటున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అతనితో ఫుల్ సినిమాని చేయలేకపోతున్నారా? ఆయన తమిళ్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపిస్తున్నాడా? గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన హీరోగా చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఇక ఆయన కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి చాలా రోజులైంది. మరి మీడియం రేంజ్ దర్శకులతో ఆయన సినిమాలు చేసి మంచి విజయాలను అందుకోవచ్చు కదా అనే వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
అయినప్పటికి తను వేటిని పట్టించుకోకుండా ఆ దర్శకుడిని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. అలా కాకుండా ఈ మైలురాయి సినిమాను తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో చేసి ఉంటే బాగుండేది. ఆయనతో పాటు తన అభిమానులు సైతం ఆనందపడేవారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన తమిళ్ డైరెక్టర్లతో సినిమా చేయడం అనేది అందరిని నిరాశ పరుస్తోంది…
గత కొద్ది రోజుల నుంచి అక్కినేని ఫ్యామిలీలో ఉన్న హీరోలందరు సక్సెస్ లను సాధించడంలో చాలావరకు డీల పడిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధిస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఆయన తమిళ్ సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్ తో సక్సెస్ ని సాధించి అందరికీ షాక్ ఇస్తాడా? లేదంటే ఆ సినిమాతో మరో ప్లాపు ను మూటగట్టుకొని విమర్శలను ఎదుర్కొంటాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక నాగార్జున తో పాటు సీనియర్ హీరోలైన చిరంజీవి బాలయ్య వెంకటేష్ లు మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు… వాళ్ళతో పోలిస్తే నాగార్జున మాత్రం చాలా వరకు వెనకబడిపోతున్నాడు…