Nagarjuna: భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులకు మరింత పండుగను పెంచేందుకు బరిలోకి దిగుతాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక చిక్కుముడి పడినట్లు అనిపిస్తుంది. జనవరిలో ” ఆర్ఆర్ఆర్ ” సినిమాలు విడుదలవడంతో సంక్రాంతి పండుగకు విడుదల కావలసిన చిత్రాలైన… పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్’, మహేష్ బాబు సర్కారు వారి పాట తదితర చిత్రాలు వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రాలకు పోటీగా అక్కినేని నాగార్జున, చైతు నటిస్తున్న బంగార్రాజు చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని సినిమా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని ప్రీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉంది నవంబర్ నాటికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని… డిసెంబర్ చివరికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతికి పోటీకి సై అంటున్నారు నాగార్జున.
ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయగలరా అనేది ఒక సందేహంగా మారింది.”సోగ్గాడే చిన్ని నాయన” మూవీ లోని గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది.ఈ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న “బంగార్రాజు” లో భారీ సెట్స్, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. తక్కువ వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం కష్టమే. కానీ నాగార్జున మాత్రం సంక్రాంతి రేస్ లో తన సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారట. చూడాలి మరి తండ్రి కొడుకు ఈ రేసులో పాల్గొంటారా లేదా అనేది వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి ఉండాలి.