Nagarjuna Emotional Kuberaa Success Meet: నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ‘కుబేర'(Kubera Movie) మూవీ సక్సెస్ మీట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆయన గురించి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. చాలా కాలం తర్వాత నాగార్జున సక్సెస్ అందుకోవడం తో ఆయన ముఖం లో స్వచ్ఛమైన ఆనందం కనిపించింది. అక్కినేని అభిమానులు అందుకు ఎంతో సంతోషించారు. ముందుగా కుబేర లో సపోర్టింగ్ క్యారక్టర్ చేయడం పై నాగార్జున అభిమానులు సంతోషించలేదు. ఆయన రేంజ్ కి తగ్గ క్యారక్టర్ కాదంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేశారు. కానీ నాగార్జున తన మనసుకి నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లే మనిషి, ఆయన పని పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు కాబట్టి, ఆయన సంతోషమే మా సంతోషం అంటూ అభిమానులు నిన్నటి ఈవెంట్ తర్వాత చెప్పుకొచ్చారు.
Also Read: నా పెద్దన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు కావాలి..మేమంతా ఆయన్ని ఇష్టపడేది అందుకే – అక్కినేని నాగార్జున!
ఇక నాగార్జున నిన్నటి ఈవెంట్ లో ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాము. ఆయన మాట్లాడుతూ ‘ముందుగా నేను ఈ సినిమా విషయంలో శేఖర్ కమ్ముల కి కృతఙ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ సినిమా నాది కాదు,ధనుష్ ది కాదు, రష్మికాది కాదు, ఇది కేవలం శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే. శేఖర్ కమ్ముల గారి థ్రిల్లర్ సినిమాని తీసి, ఆ థ్రిల్లర్ ద్వారా మానవ సంబంధాలను, ఎమోషన్స్ ని టచ్ చేసాడు. ఎలా కుదిరింది అండీ ఇది, ఈ రెండు ఒక సినిమాలో చూపించడం వర్కౌట్ అవ్వదు. శేఖర్ కమ్ముల మాత్రమే ఆ అసాధ్యమైన పనిని చేసి చూపించాడు. ఈ సినిమా కథ శేఖర్ కమ్ముల నాకు చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారక్టర్ తో పాటు సినిమా కథని మొత్తం చెప్పాడు. దీపక్ క్యారక్టర్ విన్న తర్వాత ఈ క్యారక్టర్ చుట్టూనే సినిమా కథ తిరుగుతుంది కదా, ఇది నా సినిమా అనుకొని ఒప్పుకొని చేసాను అని చెప్పాను’.
‘కానీ దానిని పట్టుకొని కొన్ని వెబ్ సైట్స్ సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు, ఇప్పుడు నా సినిమా అంటున్నాడు అని రకరకాల మీమ్స్ చేసి నాకు పంపుతున్నారు. అలాంటి వాళ్లకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే. నేను కూడా రొటీన్ హీరో రోల్స్ చేసి విసుగెత్తి పోయాను,ఒక మంచి క్యారక్టర్ చేస్తే బాగుంటుందని చాలా కాలం నుండి ఎదురు చూసాను. అలా ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ క్యారక్టర్ దొరికింది. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలను, ఈ క్యారక్టర్ తర్వాత ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు వస్తాయి నాకు. మరో 40 ఏళ్ళ వరకు నేను నా కెరీర్ ని కొనసాగించగలను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
Also Read: మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు మొక్కిన ధనుష్..కానీ నాగార్జున ని కనీసం పట్టించుకోలేదుగా!
