Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో అశ్విని ఎలిమినేషన్ తర్వాత కంటెస్టెంట్స్ తో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించారు నాగార్జున. ముందుగా ఏంటి అందరూ చాలా హ్యాపీ గా ఉన్నారు అని కంటెస్టెంట్స్ ని అడిగారు. మీరు వచ్చారు కదా సార్ అందుకే అంటూ శోభా చెప్పింది. ఇక సండే ఫండే కావడంతో .. కొన్ని ఆటలు ఆడించారు నాగ్. ఇందుకోసం కంటెస్టెంట్స్ ని స్పా బ్యాచ్ .. స్పా బ్యాచ్ అంటూ రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. కాగా స్పా టీం నుంచి అమర్ .. స్పై గ్రూప్ నుంచి ప్రశాంత్ వచ్చారు. కిచెన్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయి అని నాగార్జున అడిగారు.
అయితే అమర్ ముందుగా బజర్ కొట్టాడు. రెండు సార్ అని చెప్పాడు. రాంగ్ ఆన్సర్ మైనస్ 10 .. నువ్వు చూసి చెప్పావు అమర్ అని నాగార్జున అన్నారు. తర్వాత ‘ జోస్ అలుకాస్ రూంలో పైన ఎన్ని సిల్వర్ బెలూన్స్ ఉన్నాయి అనగానే 15 అంటూ రతిక సరైన సమాధానం చెప్పింది. ప్లాస్మా గోడపై ఎన్ని కప్స్ ఉన్నాయి అంటే 18 అంటూ రతిక చెప్పింది. దీంతో ‘ రతిక నువ్వు గేమ్ ఆడటం మానేసి ఇవన్నీ లెక్క పెడుతున్నావా అని కౌంటర్ వేశారు నాగార్జున.
ఇక ఆ తర్వాత మరో గేమ్ లో కొన్ని బొమ్మలు చూపిస్తూ .. పాటను గెస్ చేయాలని చెప్పారు. ముందుగా గువ్వా – గోరింకా బొమ్మ నాగార్జున చూపించగానే .. ప్రశాంత్ టక్కున ఆన్సర్ చెప్పేసాడు. ఇక రతిక – ప్రశాంత్ లు పాటకి డాన్స్ చేశారు. ఇందులో గువ్వా ఎవరు.. గోరింక ఎవరూ అంటూ నాగార్జున, అర్జున్ ని అడిగారు. ఏమో సార్ .. అది మాకు కూడా తెలియదు అంటూ తెలివిగా చెప్పాడు అర్జున్.
అయితే ప్రోమో చివర్లో అమర్ చేసిన పని హైలెట్ గా నిలిచింది. నాగార్జున ఒక ఫోటో చూపించారు .. ముందుగా బెల్ కొట్టిన అమర్ .. ఆన్సర్ చెప్పమనగానే .. అది శివుడి పాట సార్. ఫోటోలో ఉన్నది శివుడు సార్ అంటూ తింగరి సమాధానం చెప్పాడు. పక్కనే ఉన్న అర్జున్ షాక్ అయ్యాడు. దీంతో నాగార్జున కి కూడా మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ ఒకసారి ఆ ఫోటో చూసి .. నవ్వు ఆపుకుంటూ .. అమర్ ఆగు .. అంటూ మరోసారి ఫోటో పైకి ఎత్తి చూపించారు. దీంతో ‘ సార్ దూరం నుంచి చూసి శివుడు అనుకున్నా.. ఐనిస్టీన్ సార్ ఆయన అంటూ బిత్తర చూపులు చూసాడు. దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు.