Bigg Boss 6 Telugu- Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..ఎన్నడూ లేని విధంగా 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 7 మందికి చేరుకుంది..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఫైమా ఎలిమినేట్ అయిపోయింది..హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా మగవాళ్ళతో కూడా సరిసమానంగా పోటీపడి ఆడిన ఫైమా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబడలేకపోవడం శోచనీయం.

ఇక మొట్టమొదటి ఫైనలిస్ట్ గా టికెట్ 2 ఫినాలే టాస్కు గెలుపొంది శ్రీహాన్ ఫినాలే వీక్ కి వెళ్ళిపోయాడు..రేవంత్ , రోహిత్ , శ్రీహాన్ , ఇనాయలకు టాప్ 4 స్లాట్స్ ఖరారైపోయింది..ఇక టాప్ 5 స్పాట్ కోసం ఆది రెడ్డి , కీర్తి మరియు శ్రీ సత్య పోటీ పడాలి..టైటిల్ విన్నర్ స్లాట్ కూడా ఈసారి ఎవరు అనేది చెప్పడం కాస్త కష్టంగా మారింది..అంత అన్ ప్రెడిక్టబుల్ గా ఈ సీజన్లో నడిచింది.
నిన్న మొన్నటి వరుకు రేవంత్ కి బిగ్ బాస్ టైటిల్ పక్కా అనే విధంగా వోటింగ్ జరిగేది..కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రోహిత్ రేవంత్ కి పోటీగా వచ్చేసాడు..వీళ్లిద్దరి మధ్య ఈ వారం వోటింగ్ నువ్వా నేనా అనే రేంజ్ లో సాగింది..మరో పక్క ఇనాయ కూడా ఏమి తక్కువ కాదు..ఈమెకి కూడా వీళ్ళిద్దరితో పోటీపడేంత క్రేజ్ వచ్చేసింది..వీళ్ళ ముగ్గురిలో టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనేది చూడాలి..అయితే టైటిల్ విన్నర్ కి క్యాష్ ప్రైజ్ 50 లక్షల రూపాయిలు ఇస్తారు అనే సంగతి తెలిసిందే..కానీ బిగ్ బాస్ దానిని కొన్ని టాస్కులు నిర్వహించి 38 లక్షలకు కుదించాడు.

ఇదెక్కడి మోసం అని అందరూ అనుకున్నారు..కానీ ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున టైటిల్ విన్నర్ కి క్యాష్ ప్రైజ్ తో పాటు పాతిక లక్షల రూపాయిలు విలువ చేసే అందమైన ఇల్లుని బహుమతి గా కూడా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చాడు..మరి ఈ బంపర్ ఆఫర్ గెలుచుకునే కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే రెండు వారాలు వేచి చూడాల్సిందే.