Nagarjuna Akkineni The Ghost: సోనాల్ చౌహన్ కి స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ, సోనాల్ మాత్రం ఏవరేజ్ హీరోయిన్ గా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సోనాల్ చౌహన్ కి ఎక్కడా ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు, అలాగే బ్రేక్ కూడా రాలేదు. అసలు సోనాల్ చౌహన్ అంటే గ్లామర్ కి మారుపేరు అన్నట్టు ఉంటుంది.

అందుకే ఆమెకు అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా షూటింగ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మొదలైంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో నాగార్జున, హీరోయిన్ సోనాల్ చౌహాన్‌పై సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నారు. నిజానికి తొలుత ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకోగా.. కొద్దిరోజుల షూటింగ్ తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల ఆమె తప్పుకుంది.
Also Read: రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. సినిమా పై రాజమౌళి, గోపీచంద్ రియాక్షన్స్
తర్వాత సోనాల్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా నాగ్ కనిపించనున్నాడు. ఇక సోనాల్ విషయానికి గత పదేళ్లుగా ఆగిపోయింది. ఆమె ఎప్పటికప్పుడు అందాల ఆరబోతలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఏ మాత్రం మొహమాటం లేకుండా సినిమాలు చేస్తోంది. అయితే, స్టార్ హీరోలు ఈ బ్యూటీని ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ? కారణం.. ఆమెకు నటన రాకపోవడమా ?

అలా అనుకుంటే.. ఎందరో హీరోయిన్లకు ఎలాంటి అవకాశాలు రాకూడదు. అయినా నటన వచ్చిన హీరోయిన్లు ఈ కాలంలో ఎక్కడ ఉన్నారు ? కాబట్టి.. సోనాల్ కి ఛాన్స్ లు రాకపోవడానికి కారణం.. ఆమెకు ఉన్న నటనలో బలహీనత కాదు
Also Read: సినిమాకు 100 టికెట్లు ఇవ్వాలా? థియేటర్లకు ఆ నేత లేఖ కలకలం? నిజమేనా?
[…] Mucharla Aruna In Ram Movie: ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సీనియర్ నటి ముచ్చర్ల అరుణ తిరిగి టాలీవుడ్‍లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు ముచ్చర్ల అరుణ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయి.. సక్సెస్ అయింది కూడా. కాగా ఈ మాజీ హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించేందుకు సిద్ధమైన ముచ్చర్ల అరుణకు.. తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. […]
[…] Anushka Shetty: సినిమా రంగం అనేది అవకాశాల చుట్టూ తిరిగే పడవ లాంటివి. హీరో, హీరోయిన్లు ఫుల్ బిజీ గా ఉన్నప్పుడే కొన్ని మంచి సినిమాలు కూడా వస్తుంటాయి. కానీ సమయం లేక వాటిని వదులుకోవడం చివరికి అవి వేరే వారు చేసి హిట్ కొట్టడంతో వారు బాధపడక తప్పదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్క వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు ఏవో ఓ సారి తెలుసుకుందాం. […]
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ లపై చీటింగ్ కేసు నమోదైంది. “హౌరా బ్రిడ్జ్” సినిమా కోసం దాదాపుగా రూ.84 లక్షలు తీసుకున్నారని, ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని నిర్మాత శరన్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన డబ్బు తిరిగి ఇవ్వకపోగా..తన కాల్‌లను కూడా లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేసారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేసారు. […]