Homeఎంటర్టైన్మెంట్Nagarjuna 100th Movie: నాగార్జున 100 వ సినిమాలో కనిపించనున్న తమిళ స్టార్ హీరో...

Nagarjuna 100th Movie: నాగార్జున 100 వ సినిమాలో కనిపించనున్న తమిళ స్టార్ హీరో…

Nagarjuna 100th Movie: ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి నాగార్జున చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించడం లేదు. ఆయన ఆచితూచి మరి తమిళ దర్శకుడు అయిన కార్తీక్ ని ఎంచుకొని డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగార్జున చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతూనే వస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని అతని అభిమానులైతే అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం కుబేర, కూలీ లాంటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన రెండు సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది కీలకమైన అంశంగా మారింది.

ఇక తన వందో సినిమాను చాలా ప్రస్టేజియస్ గా తీసుకున్న నాగార్జున ఎలాగైనా సరే ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసారట…తను ఏది కావాలంటే అది ఇస్తూ సినిమాని మాత్రం సూపర్ సక్సెస్ గా నిలిపే బాధ్యతను దర్శకుడు చేతిలో పెట్టినట్టుగా తెలుస్తుంది.

అందుకే దర్శకుడు ఈ సినిమాలో తమిళంలో స్టార్ హీరో అయిన కమల్ హాసన్ చేత ఒక క్యారెక్టర్ ను చేయిస్తున్నాడట…అది ఏ క్యారెక్టర్ అనేది ఇంకా తెలియదు కానీ మొత్తానికైతే ఆయన్ని ఇందులో భాగం చేస్తున్నాడట… నాగార్జున తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి డైరెక్టర్ సైతం తన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే నాగార్జున మరోసారి తన సత్తా చాటుకున్న వాడు అవుతాడు. అలాగే సీనియర్ హీరోలు అందరితోపాటు పోటీ పడే స్థాయికి తను వెళ్ళిపోతాడు. లేకపోతే మాత్రం తన మార్కెట్ ను మరింత కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ హీరోలందరిలో నాగార్జున చాలా వరకు వెనుకబడిపోయాడు. ఇక ఈ సినిమాలతో మరింత ముందుకు వస్తాడా? లేదంటే మరింత డౌన్ అయిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version