Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో బాగా వైరల్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠనే. ఇతని బ్యాక్ స్టోరీ వింటే ఎవరికైనా ఏడుపు రావాల్సిందే. హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ప్రతీ ఒక్కరు తమ బ్యాక్ స్టోరీస్ ని చెప్పుకొని లోపలకు అడుగుపెట్టారు. అలా మణికంఠ కూడా తన బ్యాక్ స్టోరీ చెప్పడం, అది విన్న తర్వాత ఆడియన్స్ ఎమోషనల్ అవ్వడం జరిగింది. తండ్రి వదిలేసాడు, తల్లి చనిపోయింది, తన పెళ్ళాం కూడా దూరం పెట్టింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే నాగ మణికంఠ తన భార్య తో ఇప్పటికీ మాట్లాడుతున్నాడా?, లేదా అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది. రీసెంట్ గానే ఒక ఎపిసోడ్ లో తన భార్య ని తల్చుకుంటూ, తానూ ఎయిర్ పోర్ట్ లోకి వచ్చినప్పుడు ఈ కాఫీ ఫ్లవర్ పెర్ఫ్యూమ్ వేసుకొని హగ్ చేసుకుంటాను, ఆ ఫ్లవర్ మా భార్య కి చాలా ఇష్టం అని చెప్పుకుంటూ మురిసిపోయాడు.
దీని వల్లనే ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఇంతలా నాగ మణికంఠ తన భార్య గురించి చెప్తున్నాడు కదా, అసలు వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలు చూద్దాం అని ఇంస్టాగ్రామ్ కి వెళ్లి మణికంఠ ప్రొఫైల్ ని తెరిచి చూసారు. ఆ ప్రొఫైల్ లో ఆయనకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు చూడగా వాటిలో ఈ పెళ్లి వీడియో ఉంది. అలాగే ఆయన సతీమణి ఫోటో చూడగానే ఆడియన్స్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. నాగ మణికంఠ కంటే వయస్సు లో ఆమె చాలా పెద్దదిగా ఈ వీడియో చూసినప్పుడు అనిపించింది. ఆమెని చూసి మణికంఠ సిగ్గు పడడం, ఆమె కన్ను కొట్టడం, అబ్బో ఆ రొమాన్స్ చూస్తే ఎవరికైనా నవ్వు రాక తప్పదు.
దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా లో ఫన్నీ ట్రోల్ల్స్ విపరీతంగా పడ్డాయి. పాపం మణికంఠ బయటకి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఏమైపోతాడో. మొదటి వారం చాలా ఎమోషనల్ గా, మనుషులతో కలవకుండా, పిచోడిలా గాల్లో ఎదో మాట్లాడుకుంటూ తిరిగేవాడు. కానీ ఈ వారం ఆయన చాలా వరకు తనని తాను మార్చుకున్నాడు. ఈరోజు విడుదలైన రెండవ ప్రోమో లో టాస్కుల్లో కూడా ఆయన హుషారుగా పాల్గొన్నట్టు అనిపించింది. ఎమోషనల్ యాంగిల్ ని పూర్తిగా పక్కన పెట్టి, ఇదే తరహాలో ఆయన ఆటను కొనసాగిస్తే కచ్చితంగా టాప్ 5 వరకు వెళ్లే ఆకాశం ఉంది, మరో పల్లవి ప్రశాంత్ అయ్యేందుకు అవకాలు ఉన్నాయి. కూడలి మరి రాబోయే రోజుల్లో మణికంఠ ఎలా ఆడబోతున్నాడు అనేది. ప్రస్తుతం ఆయన ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చాడు. సేవ్ అవుతాడా లేదా చూడాలి, గత వారంలో ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
A post shared by Big Boss Telugu Season 8 Updates (@bigboss_teluguseason8)
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Nagamanikantha is so romantic you will be surprised to see his wedding video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com