https://oktelugu.com/

Thandel Movie: ‘విడాముయార్చి’ ని డబుల్ మార్జిన్ తో దాటేసిన నాగచైతన్య ‘తండేల్’..చరిత్రలో ఇదే తొలిసారి!

అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన 'తండేల్' చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు మామూలు రేంజ్ లో లేవు.

Written By: , Updated On : February 7, 2025 / 03:59 PM IST
Follow us on

Thandel Movie: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు మామూలు రేంజ్ లో లేవు. నాగ చైతన్య కం బ్యాక్ ఇవ్వాలి, అక్కినేని అభిమానుల పరువు కాపాడాలని అభిమానులు చాలా గట్టిగా కోరుకున్నారు కానీ, ఈ రేంజ్ లో కం బ్యాక్ ఇస్తాడని బహుశా వాళ్ళు కూడా ఊహించి ఉండరు. బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమాకంటే రెండు రెట్లు బెటర్ ట్రెండింగ్ తో ఈ సినిమా కొనసాగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. అజిత్ విడాముయార్చి చిత్రానికి గంటకు 7 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతుంటే, తండేల్ చిత్రానికి గంటకు 12 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

నాగ చైతన్య వంటి మీడియం రేంజ్ హీరో, అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి డబుల్ మార్జిన్ ఉందడం అనేది సాధారణమైన విషయం కాదు. విడాముయార్చి కి మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది, అందుకే తక్కువ ఉంది కానీ, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ నుండి బయటకి వచ్చి నాగ చైతన్య ఇలాంటి ట్రెండ్ ని చూపించడం అక్కినేని అభిమానులకు నిజంగా గర్వకారణమే. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తే ఓపెనింగ్స్ ఈ రేంజ్ ఉంటాయి, కానీ అది చేయకుండా అక్కినేని ఫ్యామిలీ హీరోలు అభిమానులు కూడా ఆసక్తి చూపలేని రేంజ్ సినిమాలు తీసారని, ఇక నుండైనా ఫామ్ ని కోల్పోకుండా ఇలాంటి క్రేజీ సినిమాలు తీసి అక్కినేని లేజసీ ని కాపాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఉంది, సినిమా హిట్ అయినా ఆమె క్రెడిట్ లోకి వెళ్ళిపోతుందని విడుదలకు ముందు కొంతమంది కామెంట్స్ చేసారు.

కానీ విడుదల తర్వాత సాయి పల్లవి కంటే నాగ చైతన్య నే అద్భుతంగా నటించాడని, ఆయన వల్లే ఈ సినిమా ఈరోజు నిలబడిందని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తుండడంతో అక్కినేని అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కచ్చితంగా తెలుగు స్టేట్స్ నుండి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నాగ చైతన్య గత చిత్రాలకు కనీసం క్లోజింగ్ లో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. పది కోట్ల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు క్లోజింగ్ లో నాగ చైతన్య మొదటి వారం లోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టబోతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఫుల్ రన్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.