https://oktelugu.com/

Nagababu: నీ తప్పులు సరిదిద్దుకో.. పుష్ప2 రిలీజ్ వేళ నాగబాబు వార్నింగ్ అల్లు అర్జున్ కేనా?

అల్లు అర్జున్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఇంటికి ఎన్నికల ప్రచారం చివరి రోజున వెళ్లి మద్దతు తెలిపి వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో నాగబాబు అల్లు అర్జున్ ని పరోక్షంగా ఉద్దేశిస్తూ వేసిన ట్వీట్ కూడా తెగ వైరల్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 2, 2024 / 09:20 PM IST

    Nagababu

    Follow us on

    Nagababu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ప్రస్తుతం గ్రాండ్ గా జరుగుతుంది. వేలాది మంది అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని అల్లు అర్జున్ మేనియా ని చూపించారు. ఇదంతా పక్కన పెడితే ఎన్నికల సమయం నుండి నేటి వరకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఏ రేంజ్ లో సోషల్ మీడియా లో గొడవలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఇంటికి ఎన్నికల ప్రచారం చివరి రోజున వెళ్లి మద్దతు తెలిపి వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో నాగబాబు అల్లు అర్జున్ ని పరోక్షంగా ఉద్దేశిస్తూ వేసిన ట్వీట్ కూడా తెగ వైరల్ అయ్యింది.

    అప్పటి నుండి మెగా మరియు అల్లు ఫ్యామిలీ మధ్య కచ్చితంగా ఎదో తేడా జరుగుతుంది. వీళ్లిద్దరి మధ్య గ్యాప్ చాలా వచ్చేసింది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. రీసెంట్ గా మెగా బ్రదర్ నాగ బాబు వేసిన ట్వీట్ కూడా అల్లు అర్జున్ ని ఉద్దేశించి వేసిన ట్వీటా?, ఇంతకూ ఆయన వేసిన ట్వీట్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. నాగబాబు మాట్లాడుతూ ‘నువ్వు వెళ్తున్న దారి తప్పు అయితే, వెంటనే దానిని సరిదిద్దుకో, అలా కాకుండా ఇంకా ఎక్కువ రోజులు సాగదీస్తే ఇంకా పెద్ద సమస్య అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియా లో అనేక కామెంట్స్, ట్రోల్ల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ టికెట్ హైక్స్ కోసం బయ్యర్స్ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కి సంబంధించి టికెట్ రేట్స్ జీవో ని విడుదల చేసారు కానీ, ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రం ఇంకా చేయలేదు.

    పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్ళాడు కాబట్టి, దాని ప్రభావం పుష్ప 2 మీద పడిందని, పవన్ కళ్యాణ్ కావాలని టికెట్ రేట్స్ ఇవ్వడం లేదని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నాగబాబు అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పి టికెట్ రేట్స్ తెచ్చుకోమని అంటున్నాడా?, లేకపోతే ఈ సమయం లో ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ వేసినట్టు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క ఎక్కడ చూసిన సోషల్ మీడియా లో అల్లు అర్జున్ పుష్ప మేనియా నే కనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు పుష్ప మూవీ ట్రెండ్ అవుతుంది. అంటే పార్ట్ 2 ని చూసే ముందు అందరూ పార్ట్ 1 చూస్తున్నారు అన్నమాట. దీనిని బట్టీ మేనియా ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించుకోండి.