Nagababu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ద్వారా కాసేపట్లో ఆంధ్ర ప్రదేశ్ లో మొదలు కానున్నాయి. ప్రీమియర్ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, ప్రతీ చోటా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. అయితే నంద్యాల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి కి సపోర్టుగా వెళ్లడం పై అప్పట్లో మెగా అభిమానులలో రెజినా సెగ, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ నాయకులు ఈ చిత్రాన్ని విడుదల చేయబోమని ఈరోజు ఉదయం హెచ్చరించగా, ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, కృష్ణ జిల్లా జనసేన పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చి, ఇలాంటి పనులు కరెక్ట్ కాదు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇలాంటివి అసలు ప్రోత్సహించరు , వెంటనే మీ హెచ్చరికలు వెనక్కి తీసుకోండి అని చెప్పాడట.
దీంతో జనసేన పార్టీ నాయకులు ఈ హాచ్చరికను వెనక్కి తీసుకొని, పార్టీ నాయకులు, అభిమానులు సినిమా విడుదలకు సహకరించాలని పిలుపుని ఇచ్చారు. అంతే కాకుండా కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్ లో పుష్ప 2 గురించి స్పందిస్తూ ‘అందరినీ అలరించే సినిమాని, కేవలం సినిమాగా మాత్రమే చూడాలని, ప్రతీ మెగా అభిమానిని, సినీ అభిమానిని కోరుకుంటున్నాను. రేపు విడుదల అవ్వబోతున్న అల్లు అర్జున్ గారి పుష్ప 2 చిత్రం పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. కక్ష్య సాధింపు చర్యలు వైసీపీ పార్టీ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని, అలాంటి చర్యలు మా ప్రభుత్వం చేపట్టబోదని పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి మెగా అభిమానులు ఈ సినిమాకి ఏ రేంజ్ లో సహకరిస్తారో చూడాలి.
ఇకపోతే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయి. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా పుష్ప మేనియా నే కనిపిస్తుంది. కేవలం ప్రీమియర్ షోస్ నుండే 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ వరల్డ్ వైడ్ గా వంద కోట్ల రూపాయిల వరకు జరిగి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 12 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. టాక్ ఒక్కటే బ్యాలన్స్. అదొక్కటి పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి. 2000 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషన్ల శ్రమతో
వేల మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…
అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని…
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 4, 2024