Nagababu Hot Comments On Posani కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్న సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వీటితో పాటు త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్టు జరుగుతోంది. బరిలో చివరికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ నిలువగా, వారి మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతునిస్తున్న మెగా నటుడు నాగబాబు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొని అసోసియేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ – పోసాని మధ్య జరిగిన మాటల యుద్ధంపై నాగబాబు స్పందించారు.

నాగబాబు మాట్లాడుతూ ‘మా’ అనేది చాలా చిన్న అసోసియేషన్ అని, సుమారుగా 900 మంది సభ్యులు ఉన్నారని కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 300 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. కాగా ఈ సంవత్సరం మరో 200 మంది సభ్యులు కూడా ఓటువేసే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొదటి నుంచి ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కే మద్దతు ప్రకటించామని, ఇప్పటివరకూ ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ దాని సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు, కానీ నరేశ్ పాలనలో మాత్రమే అసోసియేషన్ అభివృద్ధి జరగలేదని తెలిపారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ దేశద్రోహి అంటూ సీవీఎల్ చేసిన వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించాయని, ప్రకాశ్ కూడా ఈ దేశస్థుడే అని, కాకపోతే ఆయన దేవుడిని నమ్మడు కానీ, ‘మా’ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఉన్న వ్యక్తి అని నాగబాబు మా సభ్యులకు సూచించాడు.
తమ ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే తాటిమీద ఉంటామని, మా అన్నయ్య ఏ దారిలో వెళ్తే మాది అదే దారి అని అన్నాడు. ఇది ఇలా ఉండగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. కొన్ని వ్యక్తిగత ఆరోపణలు తప్ప మిగతావన్నీ ఇండస్ట్రీ బాగు గురించే పవన్ మాట్లాడాడని ఆయన అన్నారు. అనంతరం పోసాని పవన్ కాంట్రవర్సీపై మాట్లాడాలని ఒక రిపోర్టర్ అడగగా ‘ఆ వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదు’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అలాగే, ప్రకాశ్‌రాజ్‌కి ఓటు వేయొద్దంటూ సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తనకి ఎంతో గౌరవం అని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీలు, ఆ పార్టీల నేతలు జోక్యం చేసుకునే మనస్థత్వం, సమయం వారికి లేదన్నారు.