Nagababu: మె.గాస్టార్ చిరంజీవి-గరికపాటి వివాదం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇరువర్గాలు మాట్లాడుకున్నాయి. గరికపాటి నరసింహారావుతో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ కుమార్ మాట్లాడారు. మెగా ఫ్యాన్స్ ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడిగి తెలుసుకున్నారు. అలాంటిదేమీ లేదని గరికపాటి చెప్పారని సమాచారం. ఆయన మాట్లాడుతూ… చిరంజీవి గారు చాలా సౌమ్యులు ఆయనతో నేను మాట్లాడతాను అన్నారట. ఇక ఈ విషయం పై నాగబాబు సైతం స్పందించారు.

తన లేటెస్ట్ కామెంట్స్ లో ఆయన మెగా ఫ్యాన్స్ ని అభ్యర్థించారు. అభిమానులు ఎవరూ గరికపాటిని దూషించవద్దు. సోషల్ మీడియా ట్రోల్స్ కి పాల్పడవద్దని అన్నారు. అలాగే గరికపాటి చేత క్షమాపణ చెప్పించుకోవాలి అనుకోవడం లేదన్నారు. ఆయన పండితులు పది మందిలో చిరంజీవిని ఉద్దేశించి అలా మాట్లాడటంతో కామెంట్ చేయాల్సి వచ్చింది అన్నారు.కాగా సంఘటన జరిగిన వెంటనే నాగబాబు సోషల్ మీడియాలో గరికపాటిపై సటైర్ వేశారు. ఏపాటి వారికైనా చిరంజీవిని చూస్తే ఈర్ష్య పరిపాటి అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ వివాదాన్ని పరిశీలిస్తే… అలై బలై వేడుకకు హాజరైన చిరంజీవితో ఫోటోలు దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు. గరికపాటి ప్రసంగిస్తూ ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి ఆయన అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు ఫోటో షూట్ ఆపాలి. ఆయన ఆపితే నేను ప్రసంగిస్తాను. లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతానని మైక్ లో చెప్పారు. ఇది చిరంజీవి అభిమానుల మనోభావాలు దెబ్బతీసింది.
చిరంజీవి గురించి గరికపాటి అవమానకరంగా మాట్లాడి నా చిరంజీవి హుందాగా స్పందించారు. గరికపాటి వారి ప్రవచనాలు నాకు చాలా స్ఫూర్తిని ఇస్తాయి. ఆయన ఆలోచనలు నాకు చాలా దగ్గరగా ఉంటాయి. గరికపాటి గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా నేను అభినందించాను. సమయం కుదిరినప్పుడు ఇంటికి పిలిచి సన్మానం చేస్తాను అన్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివాదం సద్దుమణిగే సూచనలు కలవు. మెగా ఫ్యాన్స్ శాంతించేలా ఉన్నారు.