Naga Vamsi War 2 Buyers: సినిమా అంటే ఒక జూదం లాంటిది..కచ్చితంగా ఈ వ్యాపారం లో లాభాలు వస్తాయనే గ్యారంటీ లేదు. ఒక సినిమా సక్సెస్ అయితే నిర్మాత రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోతాడు, అదే నిర్మాత ఒకే ఒక్క ఫ్లాప్ తగిలితే నడి రోడ్డు మీదకు వచ్చేస్తాడు. ఒక వైకుంఠపాళి లాంటి ఆట అని కూడా అనుకోవచ్చు. నిర్మాతల సంగతి ఎలా ఉన్నా, మధ్యలో ఉన్న బయ్యర్స్ గురించి మాత్రం ఎవ్వరూ పెద్దగా ఆలోచించరు. ఎంతసేపు పాపం ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది, నిర్మాత నష్టపోయాడు పాపం అని జాలి పడుతామే కానీ, పాపం బయ్యర్స్ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ ఆలోచన చెయ్యరు. నిర్మాతకు అతని పెట్టిన డబ్బులు కనీసం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా అయినా కొంతమేరకు రీ కవర్ అవుతాయి, కానీ బయ్యర్స్ సంగతి?, వాళ్ళ డబ్బు పోతే మళ్ళీ తిరిగి రాదు.
Also Read: ‘ఓజీ’ టీం పై పవన్ కళ్యాణ్ అభిమానులు అసహనం..కారణం ఏమిటంటే!
అందుకే బయ్యర్స్ ని పట్టించుకోవాలి, చాలా అరుదుగా కేవలం కొంతమంది నిర్మాతలు మాత్రమే బయ్యర్స్ ని పట్టించుకుంటారు. వారిలో దిల్ రాజు ముందు ఉంటాడు, కాస్త అలాంటి లక్షణాలే యంగ్ నిర్మాత నాగవంశీ(Nagavamsi) కూడా అలవాటు చేసుకున్నాడని రీసెంట్ గా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం చూస్తే తెలుస్తుంది. ఆయన గత మూడు చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. వాటిల్లో ‘వార్ 2′(War 2 Movie) చిత్రం అయితే నాగవంశీ ని చావుదెబ్బ కొట్టింది. సాధారణంగా తన ప్రతీ సినిమా విడుదల అయిన సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి గొప్పగా మాట్లాడే నాగవంశీ ఈసారి మాత్రం అసలు కనిపించలేదు,అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. దీంతో నాగవంశీ పై ఎన్నో వందల కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అని, నేను బాగానే ఉన్నాను అంటూ నాగవంశీ ఈరోజు ఒక ట్వీట్ వెయ్యడం తో రూమర్స్ కి చెక్ పడింది.
ఇంతకీ నాగవంశీ ‘వార్ 2’, ‘కింగ్డమ్’ బయ్యర్స్ కి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే, ఆయన తదుపరి చిత్రం ‘మాస్ జాతర’ ని ఉచితంగా ఇవ్వడమే. భారీ గా నష్టపోయిన ప్రతీ ఒక్కరికి ఈ సినిమాని ఉచితంగా ఇస్తానని ఆయన చెప్పాడు. కానీ బయ్యర్స్ అందుకు ఒప్పుకోలేదు,మాకు డబ్బులు రిటర్న్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. దీంతో నాగవంశీ వాళ్ళని హైదరాబాద్ కి పిలిపించి ‘మాస్ జాతర’ ని స్పెషల్ ప్రీమియర్ షో ద్వారా వేసి చూపించాడు. వాళ్లకు బాగా నచ్చింది, నాగ వంశీ ఇచ్చిన ఆఫర్ ని ఒప్పుకున్నారు. దీంతో మాస్ జాతర రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ హీరో గా నటించిన ఈ చిత్రం బయ్యర్స్ ని ఎంత మేరకు కాపాడుతుందో చూడాలి.