Naga Shourya: “చలో” చిత్రంతో హిట్ అందుకొని అమ్మాయిల హృదయాలను సొంతం చేసుకున్నారు హీరో నాగ శౌర్య. ఈ చిత్రం తర్వాత ఆయన ఖాతాలో సూపర్ హిట్ లేదనే చెప్పాలి. అయితే ఈ ఏడాదిలో విడుదల చేసిన” వరుడు కావాలి ” చిత్రంతో ఫ్యామిలీ హిట్ అందుకొని.మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ యంగ్ హీరో . సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఏసియా సునీల్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కినది. జగపతిబాబు ,సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రను పోషిస్తున్నారు.ఈ సినిమా కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ” లక్ష్య”చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అందులో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్‌ను జరిపారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు హీరో నాగ శౌర్య… ఇటీవల విడుదలైన “రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కేతికకు ఇప్పటికే యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించింది ఈ అమ్మడు.
తాజాగా ట్రైలర్ ఈవెంట్‌లో కేతికను చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుందని అని అన్నారు హీరో శౌర్య. కేతికపై నాగ శౌర్య చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా తర్వాత కేతిక
వైష్ణవ్ తేజ్ సరసన ఓ సినిమాలో అవకాశం అందుకుంది.