Samantha-Sobhit Dhulipala : అక్కినేని కుటుంబంలో సభ్యురాలిగా మారింది శోభిత ధూళిపాళ్ల. ఏపీలోని తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభిత, నాగ చైతన్య మనసు దోచుకుంది. వీరిద్దరూ కలిసి ఒక్క చిత్రం చేయలేదు. కనీసం చిన్న కమర్షియల్ యాడ్ కూడా చేయలేదు. ఎలా జతకుదిరిందో ఎవరికీ తెలియదు. రెండేళ్లకు పైగా శోభిత-నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారు. అప్పుడప్పుడు ప్రైవేట్ ఫోటోలు లీక్ అవుతూ ఉండేవి. అయినప్పటికీ తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఖండిస్తూ వచ్చారు.
సడన్ గా ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఫేమ్ లో సమంతను బీట్ చేసింది శోభిత ధూళిపాళ్ల. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ టాప్ 10 పాప్యులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో సమంత కంటే మెరుగైన ర్యాంక్ సాధించింది. సదరు సంస్థ శోభిత ధూళిపాళ్లకు 5వ ర్యాంక్ ఇచ్చింది. అదే సమయంలో సమంతకు ఐఎండీబీ 8వ ర్యాంక్ ఇచ్చింది. స్టార్డం లో శోభిత కంటే చాలా ముందున్న సమంత ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో వెనకబడింది.
కాగా యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి 1వ ర్యాంక్ సాధించడం విశేషం. దీపికా పదుకొనె, ఇషాన్ కట్టర్, షారుఖ్ ఖాన్, శోభిత టాప్ 5లో ఉన్నారు. అనంతరం శార్వరి, ఐశ్వర్య రాయ్, సమంత, అలియా భట్, ప్రభాస్ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. టాలీవుడ్ హీరోల్లో ఒక్క ప్రభాస్ కి మాత్రమే చోటు దక్కింది.
కాగా సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంత 2021లో విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు తెలియజేశారు. సమంత కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆమెకు పెళ్లి ఆలోచన లేదంటూ పుకార్లు ఉన్నాయి. ఇటీవల సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశాడు.
సమంత నటించిన సిటాడెల్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. ఆ మధ్య సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ లో సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు.
Web Title: Naga chaitanyas wife shobhita dominates samantha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com