Naga Chaitanya: రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో ఇండియా వైడ్ చర్చకు దారి తీసింది. పలువురు సెలబ్రిటీలు రష్మిక మందానకు మద్దతుగా నిలుస్తున్నారు. వీడియో క్రియేట్ చేసిన వాళ్ళను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అనే యువతి ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె హాట్ గా ఉన్నారు. జరా పటేల్ వీడియోను డీప్ ఫేక్ చేసి రష్మిక వీడియో పేరుతో వైరల్ చేశారు.
ఒక జర్నలిస్ట్ ఒరిజినల్ వీడియోతో పాటు అసలు విషయం బయటపెట్టాడు. ఇది సీరియస్ మేటర్ చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ వంటి నటుడు సోషల్ మీడియాలో స్పందించడంతో మరింత ప్రాచుర్యం పొందింది. తాజాగా అక్కినేని నాగ చైతన్య స్పందించారు. రష్మిక ట్వీట్ ని కోట్ చేస్తూ ఆయన కీలక కామెంట్స్ చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అవుతున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే భయం వేస్తుంది. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి బాధితులను కాపాడేందుకు కొత్త చట్టాలు రావాలి. రష్మిక ధైర్యంగా ఉండు… అని ట్వీట్ చేశారు. నాగ చైతన్య ట్వీట్ వైరల్ అవుతుంది.
రష్మిక మందాన సైతం సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వీడియో నేను చదువుకునే రోజుల్లో వైరల్ అయితే పరిస్థితి ఏంటి? నేను ఎదుర్కోగలనా? అంటూ ఆమె కామెంట్ చేశారు. స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తుంది. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. రన్బీర్ కపూర్ తో చేస్తున్న యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది.
It’s truly disheartening to see how technology is being misused and the thought of what this can progress to in the future is even scarier.
Action has to be taken and some kind of law has to be enforced to protect people who have and will be a victim to this .Strength to you. https://t.co/IKIiEJtkSx— chaitanya akkineni (@chay_akkineni) November 6, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Naga chaitanyas shocking reaction on rashmika mandanna deep fake video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com