https://oktelugu.com/

Naga Chaitanya: ‘నా తొలి రొమాన్స్ ఆమెతోనే జరిగింది’ అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

యాంకర్ నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ 'మీ తొలిముద్దు ఎవరితో జరిగింది' అని అడగగా, దానికి నాగ చైతన్య సమాధానం చెప్తూ 'ఆఫ్ స్క్రీన్ లో తొలిముద్దు ఎవరితో జరిగింది అనే విషయాన్నీ మాత్రం నేను చెప్పను కానీ,

Written By:
  • Vicky
  • , Updated On : May 8, 2023 / 08:30 AM IST
    Follow us on

    Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ 12 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, తమిళ సీనియర్ హీరోలు అరవింద్ గో స్వామి మరియు శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.

    టీజర్ మరియు ట్రైలర్ తోనే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అమితాసక్తిని కలిగించిన ఈ సినిమా లో నాగ చైతన్య కానిస్టేబుల్ గా నటించాడు.ఈ గెటప్ లో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. కేవలం గెటప్ లోనే కాదు, ఇంటర్వ్యూస్ లో కూడా నాగ చైతన్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. యాంకర్స్ అడిగే ప్రతీ ప్రశ్నకి చాలా బోల్డ్ గా ఎలాంటి ముసుగు లేకుండా సమాదానాలు చెప్తున్నాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    యాంకర్ నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ తొలిముద్దు ఎవరితో జరిగింది’ అని అడగగా, దానికి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘ఆఫ్ స్క్రీన్ లో తొలిముద్దు ఎవరితో జరిగింది అనే విషయాన్నీ మాత్రం నేను చెప్పను కానీ, ఆన్ స్క్రీన్ లో మాత్రం ‘ఏం మాయ చేసావే’ సినిమాలో సమంత తోనే జరిగింది.7 వ క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయిని తొలిసారి ఇష్టపడ్డాను, ఆ తర్వాత ఇంటర్ లో మొట్టమొదటిసారి ఒక అమ్మాయితో డేటింగ్ కి వెళ్ళాను, నేను ఏ అమ్మాయిలో అయినా చూసేది అందం కాదు,వ్యక్తిత్వం.అది నచ్చితేనే స్నేహం అయినా, ప్రేమ అయినా.లేకుంటే దూరం గా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు.కొద్దీ రోజుల క్రితమే నాగ చైతన్య సమంత గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన సంగతి తెలిసిందే.అవి ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.