Naga Chaitanya- Samantha: సమంత డబుల్‌ మీనింగ్‌ పై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya- Samantha: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. కానీ సామ్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చైతు వరకూ వెళ్లినట్టు ఉన్నాయి. తాజాగా సమంత గురించి నాగచైతన్య కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. నాగచైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ యూ’ సినిమా చేస్తున్నాడు. […]

Written By: Shiva, Updated On : July 6, 2022 8:19 am
Follow us on

Naga Chaitanya- Samantha: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. కానీ సామ్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చైతు వరకూ వెళ్లినట్టు ఉన్నాయి. తాజాగా సమంత గురించి నాగచైతన్య కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. నాగచైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Naga Chaitanya- Samantha

ఈ సందర్భంగా చైతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ర్యాపిడ్‌ క్వశ్చన్స్‌ అంటూ ఐదు డబుల్‌ మీనింగ్‌ పదాలు చెప్పాలని యాంకర్‌ చైతుని కోరాడు. అయితే.. ఈ మాటకు చైతు తనదైన శైలీలో సమాధానం ఇస్తూ.. ‘నాకు డబుల్‌ మీనింగ్‌ పదాలు తెలియవు. నేను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తాను. డబుల్‌ మీనింగ్‌లో మాట్లాడడం నాకు ఎప్పటికీ రాదు’ అంటూ నాగచైతన్య కామెంట్స్ చేశాడు.

Also Read: Senior Hero Naresh: నరేశ్ ముగ్గురు భార్యలు ఎవరు..? అసలు ఆయన ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు..?

అయితే, సామ్ ను దృష్టిలో పెట్టుకునే.. ఏ విషయాన్ని అయినా తాను సూటిగా చెప్తానని చైతు చెప్పాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య తన విడాకుల గురించి సామ్ డబుల్‌ మీనింగ్‌లో మాట్లాడడం జరిగింది. ఆ మాటలకు చైతు ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు. ఇక వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా ఈ “థాంక్యూ” చిత్రం రాబోతుంది.

Naga Chaitanya- Samantha

ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ లో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడు. చైతు పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక చైతు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వస్తాడని.. ఈ జర్నీలో గొప్ప సెంటిమెంట్ తో సాగే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం నేపథ్యం చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందట.

నిజానికి ఈ సినిమా కథ గురించి మరో రూమర్ కూడా బాగా వినిపిస్తోంది. ఓ మధ్యతరగతి అబ్బాయి ఎన్నో కష్టాలు పడి.. ఇంటర్ నేషనల్ గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అపజయాలు పొందాడు అనే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయట. అదేవిధంగా తన విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.

Also Read:Pavithra Lokesh Old Pics Viral : అంత నీట్ గా ఉండే పవిత్రా లోకేష్ గతంలో అంత బోల్డ్ నా? హాట్ ఫొటోలు లీక్

Tags