Naga Chaitanya, Samantha సమంత లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు అంటూ నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

నాగ చైతన్య సమాధానం చెప్తూ 'ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ గా ఉన్నాం. సమంత చాలా మంచి అమ్మాయి, ఆమెకి అన్నీ మంచి జరగాలి, మేము విడిపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు,

Written By: NARESH, Updated On : May 5, 2023 6:08 pm
Follow us on

Naga Chaitanya Samantha : అక్కినేని నాగ చైతన్య సమంత తో విడిపోయి రెండేళ్లు అవుతున్నా కూడా వీళ్ళ గురించి ఇప్పటికీ సోషల్ మీడియా లో ఏదో ఒక రూమర్ ప్రచారం అవుతూనే ఉంటోంది.  విడిపోయిన తర్వాత వీళ్లిద్దరు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. నాగ చైతన్య తన సినిమాలతో తాను బిజీ గా ఉంటే, సమంత ఒక పక్క సినిమాలు , వెబ్ సిరీస్ లు అంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతోంది.

ఇటీవలే ఆమె మయోసిటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఇక అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12 వ తారీఖున తెలుగు , తమిళం భాషలలో ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నాగచైతన్య ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.

రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు నాగ చైతన్య చెప్పిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.. కస్టడీ సినిమా గురించి, భవిష్యత్తులో ఆయన చేయబోతున్న సినిమా గురించి మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పాడు.

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది, ఆమె లేని జీవితానికి మీరు అలవాటు పడ్డారా అని అడగగా దానికి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ గా ఉన్నాం. సమంత చాలా మంచి అమ్మాయి, ఆమెకి అన్నీ మంచి జరగాలి, మేము విడిపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు, కానీ మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి గౌరవం ఇప్పటికీ అలాగే ఉంది. సోషల్ మీడియా లో కొంతమంది రాసేవి చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు, అదంతా సోషల్ మీడియాలో కొంతమంది సృష్టించిన రూమర్స్’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.