Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని యూత్ ఆడియన్స్ లో ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు అక్కినేని నాగ చైతన్య. ‘జోష్’ సినిమాతో నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసాడు. ఆ తర్వాత ‘ఏ మాయ చేసావే’, ‘100 % లవ్’ ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘ఒక లైలా కోసం’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఇలా ఒక్కటా రెండా ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలను నాగ చైతన్య మన టాలీవుడ్ కి అందించాడు. అయితే ఈమధ్య కాలంలో నాగ చైతన్య కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలడం లేదు. ‘థాంక్యూ’, ‘కస్టడీ’ చిత్రాలతో ఆయన ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. దీంతో అక్కినేని అభిమానులు డీలా పడ్డారు. ఇప్పుడు నాగ చైతన్య కి అర్జెంటు గా ఒక భారీ హిట్ అవసరం. కేవలం నాగ చైతన్య కి మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి అవసరమే. గత కొంతకాలం నుండి ఈ ఫ్యామిలీ కి సరైన హిట్ లేదు. అలాంటి సమయంలో నాగ చైతన్య ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించాడు. చందు మొండేటి దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 70 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
చాలా వరకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని , దీపావళి కానుకగా నవంబర్ 14 వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియన్ లెవెల్ లో విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉండడం, పలు రీ షూట్స్ పెట్టుకోవడం తో ఈ చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం విడుదల కాబోతుంది. జనవరి 10 వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.
అలాగే బాలకృష్ణ – బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా, వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఇంత మంది సీనియర్ హీరోల సినిమాల మధ్య నాగ చైతన్య ‘తండేల్’ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకోవడం నిజంగా సాహసమే. దీనిపై సోషల్ మీడియా లో అభిమానులు నాగ చైతన్య పై మండిపడుతున్నారు. సీనియర్ హీరోల సినిమాలను లెక్క చేయకుండా మధ్యలోకి వస్తున్నావు, అసలే కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా అది, దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అలాంటి పోటీ వాతావరణంలోకి మన సినిమాని దింపొద్దు, ఆడియన్స్ పట్టించుకోరు అంటూ నాగ చైతన్య కి సలహా ఇస్తున్నారు అభిమానులు.