Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య చాలా కూల్ గా ఉండే వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే. తాను ఇండస్ట్రీ లో ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిని అనే గర్వం అతనిలో కనిపించదు. అందుకే నాగ చైతన్య అక్కినేని అభిమానులతో పాటుగా, ఇతర హీరోల అభిమానులు కూడా ఇష్టపడుతారు.సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నాగ చైతన్య కి ఎక్కువగా సపోర్టు చేసారు నెటిజెన్స్.ఆయన మీద అంత గొప్ప అభిప్రాయం ఉంది.
ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన, తమిళ సీనియర్ హీరో అరవింద్ గో స్వామి విలన్ గా నటించాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ఏజెంట్’ డిజాస్టర్ ఫ్లాప్ తో డీలా పడిన అక్కినేని ఫ్యాన్స్, ఇప్పుడు ‘కస్టడీ’ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఇటీవలే ప్రారంభించాడు నాగ చైతన్య. అందులో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అందులో జరిగిన ఒక ట్రూత్ ఆర్ డేర్ సెషన్ లో యాంకర్ ఇర్ఫాన్ అడిగిన ప్రశ్నలకు నాగ చైతన్య చాలా ఆసక్తి కరమైన సమాదానాలు చెప్పాడు.
ఆయన నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ ఎప్పుడైనా మీరు కార్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు బయట నుండి ఎవరైనా చూసారా’ అని అడిగినప్పుడు నాగ చైతన్య దానికి సమాధానం చెప్తూ ‘అనుకోకుండా ఒకసారి పోలీస్ చూసాడు’ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు మీరు ఎంత మందిని కిస్ చేసి ఉంటారు అని అడిగిన ప్రశ్నకి నాగచైతన్య సమాధానం చెప్తూ ‘ఎంత మందిని చేసానో నాకే గుర్తు లేదు,సినిమాల్లో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు చేశా,అది పబ్లిక్ గానే ఉన్నాయి కదా, మీరే లెక్కపెట్టుకోండి’ అంటూ నాగ చైతన్య సమాధానం చెప్పాడు.