Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya : నాగ చైతన్య-సుకుమార్ కాంబోలో మూవీ, ప్రీ లుక్ పోస్టర్ తో అంచనాలు...

Naga Chaitanya : నాగ చైతన్య-సుకుమార్ కాంబోలో మూవీ, ప్రీ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన అక్కినేని హీరో!

Naga Chaitanya : నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన గత రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన యంగ్ టాలెంటెడ్ దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. కాగా నాగ చైతన్య నేడు 24వ చిత్రం పై అధికారిక ప్రకటన విడుదల చేశాడు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. మిస్టికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక కాన్సెప్ట్ పోస్టర్ అద్భుతంగా ఉంది. అంచనాలు పెంచేసింది. 
 
కాగా NC 24లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ భాగం కావడం విశేషం. ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. బడ్జెట్ కొంచెం భారీగానే ఉంటుందని సమాచారం. ఇతర నటీనటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. నాగ చైతన్య ఈ చిత్రంతో మంచి విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 
 
ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఆయన డీగ్లామర్ రోల్ ట్రై చేస్తున్నాడు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారని సమాచారం. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. 
 
మరోవైపు నాగ చైతన్య పెళ్లి హడావుడిలో ఉన్నాడు. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్యకు డిసెంబర్ 4న వివాహం. అన్నపూర్ణ స్టూడియోలో ఈ వివాహం జరగనుంది. పెళ్లి నిరాడంబరంగా చేయాలని నాగార్జునకు నాగ చైతన్య సూచించాడట. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానం ఉందట. బంధుమిత్రులతో పాటు అత్యంత సన్నిహితులు, పరిశ్రమ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. 
 
రెండేళ్లకు పైగా నాగ చైతన్య-శోభిత డేటింగ్ చేస్తున్నారు. విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట ఫోటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆగస్టు 8న నాగార్జున నివాసంలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. 
RELATED ARTICLES

Most Popular