నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’ డబ్బింగ్ ఈ రోజు శబ్ధాలయ స్టూడియోస్ లో మొదలైంది. మొదట చైతు తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే సినిమాలో ఒక సీన్ కి సీజీ వర్క్ చేయాలట. ఆ వర్క్ ను కూడా దగ్గర ఉండి చేయిస్తోంది టీమ్. వచ్చే నెల మొదటి వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట. ఇక శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ఈ ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గత వారం ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే చైతు పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం సాయి పల్లవి మీద ఉన్న బ్యాలెన్స్ సీన్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
Also Read: ఓటీటీలో టాలీవుడ్ సందడి షురూ!
అన్నట్టు ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే షూట్ చేస్తున్నామని టీమ్ ఇప్పటికే షూటింగ్ వీడియోలను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం.. పైగా మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాలో హీరో కావడంతో ఈ సినిమా కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఆసక్తిగా ఎదురుచేస్తున్నాయి. ఇప్పటికే సినిమాకి ఉన్న మార్కెట్ కంటే కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేశాయి. అన్నిటికి మించి శేఖర్ కమ్ముల ఈ సినిమాకి డైరెక్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇష్టమైన డైరెక్టర్. అందుకే ఒటిటి ప్లాట్ ఫామ్స్ ఈ సినిమా కొనడానికి పోటీ పడుతున్నాయి.
ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు ఉన్న మంచి పేరు రిత్యా.. ఈ సినిమా నిర్మాతలు సినిమాని భారీ మొత్తానికి అమ్మాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట. పైగా శేఖర్ తో పాటు చైతు, సాయి పల్లవి ముగ్గరు సక్సెస్ లో ఉన్నారు. అందుకే నిర్మాతలు ఎక్కాడా వెనక్కి తగ్గడం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి వస్తున్నారు.
Also Read: డ్రగ్స్ ఆరోపణల పై నవదీప్ సెటైర్ !