Adivi Sesh Dacoit movie : యంగ్ హీరోలలో స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో అడివి శేష్(Adivi Sesh) కి ఉన్నంత పట్టు, ఏ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ‘క్షణం’ చిత్రం నుండి, రీసెంట్ గా విడుదలైన ‘డెకాయిట్'(Dacoit Movie) వరకు అడివి శేష్ ప్రతీ సినిమా ఎంతో స్పెషల్. ఆడియన్స్ కి ఈ చిత్రాలు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించాయి. ఇక ‘డెకాయిట్’ విషయానికి వస్తే , ఈ సినిమా బాగానే ఉంది కానీ, కచ్చితంగా అడివి శేష్ స్టాండర్డ్స్ కి తగ్గ సినిమా కాదనే టాక్ బలంగా వచ్చింది. అయినప్పటికీ మొదటి మూడు రోజుల్లోనే నిర్మాత ని సేఫ్ జోన్ లోకి తీసుకొని రావడమే కాకుండా, ఇప్పుడు బయ్యర్స్ ని కూడా సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చే దిశగా , ఈ చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది.
ఇకపోతే సినిమాకు నిర్మాత అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మేనకోడలు, సుప్రియ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని అడివి శేష్ తో కాకుండా, అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో చెయ్యాలని అనుకుందట. స్టోరీ , స్క్రీన్ ప్లే అడివి శేష్. కానీ నాగ చైతన్య మాత్రం ఒప్పుకోలేదట. ఈ సినిమా నాకంటే , అడివి శేష్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పాడట. ఈ విషయాన్నీ అడివి శేష్ కి కూడా ఆయన ఫోన్ చేసి చెప్పాడట. దీంతో ఈ చిత్రంలో అడివి శేష్ నే హీరో గా నటించాల్సి వచ్చింది. అయితే ఇందులో అడివి శేష్ నటించడమే కరెక్ట్, నాగ చైతన్య చేసుంటే కాచివటంగా ఫ్లాప్ అయ్యేదని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే వరుస హిట్స్ కారణంగా అడివి శేష్ కి మార్కెట్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. కానీ నాగ చైతన్య కెరీర్ మాత్రం ఆ రేంజ్ లో లేదు.
ఆయన గత చిత్రం ‘తండేల్’ సూపర్ హిట్ అయ్యినప్పటికీ , ‘డెకాయిట్’ లాంటి జానర్ సినిమాలను బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చేసేంత కెపాసిటీ నాగ చైతన్య కి ఇంకా రాలేదని , అడివి శేష్ చేయడం వల్లే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుని త్వరలో అందుకోబోతుందని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రన్ వర్కింగ్ డేస్ లో కూడా చాలా సాలిడ్ గా సాగుతోంది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు , స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
