https://oktelugu.com/

Naga Chaitanya : నాగ చైతన్యకు ఆ హీరోయిన్ అంటే అంత భయమా? కారణం ఏమిటో తెలుసా? ఓపెన్ గా చెప్పేసిన అక్కినేని హీరో!

అక్కినేని హీరో నాగ చైతన్యకు ఓ హీరోయిన్ అంటే చాలా భయం అట. ఆమెతో నటించాలంటే వణికిపోతాడట. నాగ చైతన్య ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. నాగార్జున వంటి బడా హీరో కొడుకు. అలాంటి నాగ చైతన్య ఓ హీరోయిన్ కి భయపడం ఏమిటీ? ఇంతకీ ఎవరా హీరోయిన్?

Written By:
  • S Reddy
  • , Updated On : December 9, 2024 / 11:20 AM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya : హీరో నాగ చైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. సమంతకు ఆయన 2021లో విడాకులు ఇచ్చారు. అనంతరం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. రెండేళ్లకు పైగా శోభిత-నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారు. వీరి ఎఫైర్ పై కథనాలు వెలువడ్డాయి. కొన్ని ప్రైవేట్ ఫోటోలు బయటకు వచ్చాయి. అయినప్పటికీ తమకు ఎలాంటి రిలేషన్ లేదని వాదించారు. సడన్ గా ఆగస్టు 8న నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగార్జున నివాసంలో చాలా నిరాడంబరంగా ఈ వేడుక ముగిసింది.

    డిసెంబర్ 4న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ఈ వేడుక ముగించారు. శోభితతో వివాహానికి ముందు నాగ చైతన్య రానా టాక్ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాగా నాగ చైతన్యకు ఓ హీరోయిన్ అంటే చాలా భయం అట. ఆమె ఎవరో కాదు.. సాయి పల్లవి అట. సాయి పల్లవి గొప్ప నటి, బెస్ట్ డాన్సర్. ఆమెతో నటించాలన్నా, డాన్స్ చేయాలన్నా… నాగ చైతన్యలో ఒకింత ఆందోళన నెలకొంటుంది అట.

    వీరిద్దరి కాంబోలో గతంలో లవ్ స్టోరీ విడుదలైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించి లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్. కాగా మరోసారి ఈ కాంబినేషన్ సిద్ధం అవుతుంది. నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ లో సమంత-నాగ చైతన్య జంటగా నటిస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎమోషనల్ లవ్ డ్రామా. నాగ చైతన్య జాలరి యువకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

    గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. బుజ్జి తల్లి సాంగ్ తో ఆయన అంచనాలు పెంచేశాడు. నాగ చైతన్యకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన గత రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ డిజాస్టర్ అయ్యాయి. తండేల్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు.