https://oktelugu.com/

Custody Movie First Review: ‘కస్టడీ’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. చివరి 40 నిమిషాలు అరాచకం!

క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించేలా ఈ చిత్రం వచ్చిందని, కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తుంది ఈ ప్రివ్యూ షో చూసిన ప్రతీ ఒక్కరు మూవీ యూనిట్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారట.

Written By:
  • Vicky
  • , Updated On : May 8, 2023 / 02:06 PM IST

    Custody Movie First Review

    Follow us on

    Custody Movie First Review: వరుస సూపర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న నాగ చైతన్య కి ‘థాంక్యూ’ చిత్రం రూపం లో పెద్ద డిజాస్టర్ పడింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘కస్టడీ’ చిత్రం 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య మరియు మూవీ యూనిట్ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.అంతే కాదు రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచేసింది.

    ఎలాంటి సినిమా కోసం అయితే అక్కినేని అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారో, అలాంటి సినిమా రాబోతుందని ట్రైలర్ ని చూసినప్పుడే అందరికీ అర్థం అయ్యింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నాగ చైతన్య ఈ చిత్రం పై చాలా నమ్మకం తో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖుల మధ్య చూసిందట, మరి రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.

    వెంకట్ ప్రభు సినిమాలు ప్రారంభం నుండి ప్రేక్షకుడిని సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది, ఈ సినిమా కూడా అదే విధంగా ఉందట. ప్రారంభం మొదటి 20 నిమిషాలు సాఫీగా, కూల్ గా సాగిపోతుందట, ఆ తర్వాత నుండి అసలు కథ మొదలవుతుంది, 40 వ నిమిషం లో అరవింద్ గో స్వామి ఎంట్రీ తర్వాత నుండి సినిమా మరోలెవెల్ కి వెళ్తుందట.

    క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించేలా ఈ చిత్రం వచ్చిందని, కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తుంది ఈ ప్రివ్యూ షో చూసిన ప్రతీ ఒక్కరు మూవీ యూనిట్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారట.ఈ వార్త విని అక్కినేని ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు,మరి ఈ టాక్ కి తగ్గట్టుగానే సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఎదురు చూడాలి.