Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సెకండ్ జనరేషన్ హీరోగా ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర అయితే వేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని మూడవ తరం హీరోగా వచ్చిన నాగ చైతన్య కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో నాగార్జున నాగచైతన్యకు మధ్య పోటి ఎదురవుతుందని ఎవరు అనుకొని ఉండరు. ఇక అక్కినేని అభిమానులు కూడా ఇది ఊహించి ఉండరు కానీ ఈ ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున ప్రసన్నకుమార్ బెజవాడ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా, అలాగే నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో చేస్తున్న తండేల్ సినిమా ఈ రెండు సినిమాలు కూడా దసర కి రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు రెండు, మూడు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే సమాచారం అయితే అందుతుంది. ఇక నాగచైతన్య వాళ్ళ నాన్న నాగార్జునకి తన సినిమాతో పోటీ ఇస్తున్నాడు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఈ విషయంలో నాగార్జున మాత్రం పుత్రోత్సాహం పొందుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నాగచైతన్య చేసే తండేల్ సినిమా ఒక డిఫరెంట్ కేటగిరీకి చెందిన సినిమాగా రాబోతుంది.
ఇక ఈ సినిమాకి చందు మొండేటి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈయన డైరెక్షన్ లో ఇంతకుముందు వచ్చిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది. అలాగే బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందుకే ఈ సినిమా మీద పాన్ ఇండియా రేంజ్ లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక నాగార్జున నాగచైతన్య పోటీలో ఎవరు విజయం సాధిస్తారనేది తెలియాల్సి ఉంది…