Naga Chaitanya: విధి చాలా చెడ్డది, ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. అందంగా ఊహించుకున్న జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. సమంత నాగ చైతన్య విడాకులు కూడా విధి వంచన అనాలి. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ అందమైన జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య కుటుంబం ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా పట్టుబట్టి సమంత మెడలో తాళి బొట్టు కట్టాడు నాగ చైతన్య. వివాహం అనంతరం సమంత నాగ్ ఫ్యామిలీ కి బాగా దగ్గరయ్యారు. ఆమె ప్రవర్తన, చురుకుతనం, కలివిడితనం కుటుంబ సభ్యులకు బాగా నచ్చాయి.

నాగ్ ఫ్యామిలీలో జరిగే వేడుకలలో సమంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేవారు. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా సమంత, చైతూ ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకునేవారు. అలాంటి సమంత చైతూ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. నాలుగు నెలలకు పైగా వేరువేరుగా ఉంటున్న సమంత, చైతూ ఒంటరి జీవితాలు గడుపుతున్నారు. దీంతో చైతూ తన 35వ బర్త్ డే సమంత లేకుండా ఒంటరిగా జరుపుకోవాల్సి వచ్చింది. నాగ చైతన్య లాస్ట్ బర్త్ డే వేడుకలు సమంత దగ్గరుండి ఘనంగా సెలబ్రేట్ చేశారు. గత ఏడాది చైతూ పుట్టినరోజు వేడుకల కోసం ఇద్దరూ మాల్దీవ్స్ కి వెళ్లారు. దాదాపు నెల రోజులు అక్కడే విహారం చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కూడా లేకపోవడంతో, ఇద్దరూ దీవుల దేశంలో ఎంజాయ్ చేశారు.
అప్పుడు సమంతతో జంటగా బర్త్ డే జరుపుకున్న నాగ చైతన్య, ఇప్పుడు ఆమె లేకుండా కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత దూరం కావడం నాగ చైతన్యను మానసిక వేదనకు గురి చేసింది. సమంతతో కలిసి ఉండాలని కొత్తగా కొన్న ఇంటిలోనే నాగ చైతన్య ఒంటరిగా ఉంటున్నారట.ఇక సమంత జ్ఞాపకాల నుండి బయటపడేందుకు చైతన్య షూటింగ్స్ లో బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన హీరోగా ప్రస్తుతం రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Also Read: Nidhhi Agerwal: హీరోయిన్ అంటే.. ఆమె దృష్టిలో ఒక్క ఎక్స్ పోజింగే !
తండ్రి నాగార్జునతో చేస్తున్న బంగార్రాజు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ నుండి టీజర్ కూడా విడుదల చేశారు. బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగే అవకాశంకలదని వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ఇది సీక్వెల్ కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ మూవీలో నటిస్తున్నారు.
Also Read: Natural Star Nani: మదర్ ఆఫ్ డ్రాగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటున్న హీరో నాని…