Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya-Akhil Multistarrer: ఫ్లాప్ డైరెక్టర్ తో నాగ చైతన్య - అఖిల్ మల్టీస్టార్ర్ర్ చిత్రం...

Naga Chaitanya-Akhil Multistarrer: ఫ్లాప్ డైరెక్టర్ తో నాగ చైతన్య – అఖిల్ మల్టీస్టార్ర్ర్ చిత్రం ఖరారు

Naga Chaitanya-Akhil Multistarrer: కరోనా లాక్ డౌన్ సమయం లో OTT కి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం ఇప్పుడు మూవీ మేకర్స్ కి పెద్ద సవాలు గా మారిపోయింది..సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే థియేటర్స్ కి అసలు కదలని పరిస్థితి ఏర్పడింది..దీనితో మూవీ మేకర్స్ ఇప్పుడు ముల్టీస్టార్ర్ర్ సినిమాల మీద పడ్డారు..ఈ ఏడాది భారీ విజయాలుగా నమోదు చేసుకున్న సినిమాలన్నీ కూడా ముల్టీస్టార్ర్ర్ సినిమాలు అవ్వడం విశేషం..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ ముల్టీస్టార్ర్ర్ #RRR చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఇక తర్వాత ఇటీవల విడుదలైన సంచలన విజయం సాధించిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా కూడా ఒక ముల్టీస్టార్ర్ర్ సినిమానే..మన టాలీవుడ్ లో కూడా వరుసగా ముల్టీస్టార్ర్ర్ చిత్రాలు తెరకెక్కబోతున్నాయి..వాటిల్లో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ గా అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ప్రాజెక్ట్ అక్కినేని ఫామిలీ వారి ముల్టీస్టార్ర్ర్ చిత్రం.

Naga Chaitanya-Akhil Multistarrer
Naga Chaitanya-Akhil Multistarrer

ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ కలిసి అతి త్వరలోనే ఒక ముల్టీస్టార్ర్ర్ చిత్రం లో నటించబోతున్నారట..ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు..శ్రీకాంత్ అడ్డాల..కొత్త బంగారు లోకం , ముకుంద మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న శ్రీకాంత్ అడ్డాల , ఆ తర్వాత మహేష్ బాబు తో చేసిన బ్రహ్మోత్సవం సినిమా ఎంత పెద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా అతని సినీ కెరీర్ ని నాశనం చేసింది..వేరే లెవెల్ కి వెళ్తాడు అనుకున్న ఈ దర్శకుడు ఈ సినిమా దెబ్బకి ఎటు కనపడకుండా పొయ్యాడు..అయితే చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన నారప్ప సినిమాకి దర్శకత్వం వహించాడు.

Also Read: Director Shankar- Ram Charan: రామ్ చరణ్ ని రిస్క్ లో పడేసిన డైరెక్టర్ శంకర్.. ఆందోళనలో ఫాన్స్

Naga Chaitanya-Akhil Multistarrer
Naga Chaitanya-Akhil

ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా OTT లో నేరుగా విడుదల చేసారు..OTT లో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..కానీ ఇది తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘అసురన్’ అనే సినిమాకి రీమేక్ అవ్వడం, విక్టరీ వెంకటేష్ కి ఎక్కువ మార్కులు పడడం తో శ్రీకాంత్ అడ్డాల కి ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు..దీనితో ఈసారి ఎలా అయినా స్ట్రెయిట్ స్టోరీ తో హిట్ కొట్టాలని ఒక అద్భుతమైన కథ ని సిద్ధం చేసాడట నాగ చైతన్య – అఖిల్ కోసం..మరి ఈ క్రేజీ ముల్టీస్టార్ర్ర్ మూవీ తో శ్రీకాంత్ అడ్డాల బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

Also Read:Ram Charan- Shankar Movie: ఇదంతా ఫేక్.. చరణ్, శంకర్ సినిమా పై మేకర్స్ క్లారిటీ

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular