https://oktelugu.com/

తన అల్లుడికి నాగబాబు ఖరీదైన గిఫ్ట్

పెళ్లి అయినప్పటి నుంచి కూతురుకు, అల్లుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని ఓ ఖరీదైన గిఫ్ట్ ను కానుకగా ఇచ్చాడు. మెగా అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశాడు. తాజాగా నాగబాబు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ గిఫ్ట్ ఏంటనేది.? వివరాలను షేర్ చేశాడు. మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదని.. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని నాగబాబు తెలిపారు. ఉగాదికి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2021 / 11:18 AM IST
    Follow us on

    పెళ్లి అయినప్పటి నుంచి కూతురుకు, అల్లుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని ఓ ఖరీదైన గిఫ్ట్ ను కానుకగా ఇచ్చాడు. మెగా అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశాడు.

    తాజాగా నాగబాబు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ గిఫ్ట్ ఏంటనేది.? వివరాలను షేర్ చేశాడు. మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదని.. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని నాగబాబు తెలిపారు. ఉగాదికి ఇద్దామనుకున్నా కుదరలేదని.. అందుకే ఇప్పుడు ఓ రేంజ్ రోవర్ డిస్కవరీ ఖరీదైన కారును తీసుకొని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నట్టు నాగబాబు తెలిపారు.

    నిహారిక-చైతన్య దంపతుల ఇంటికి వెళ్లి మరీ నాగబాబు దంపతులు ఈ ఖరీదైన కారును బహుమతిగా అందించారు.

    గత ఏడాది డిసెంబర్ 9న నాగబాబు కూతురు నిహారికకు గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లో జరిగిన వీరి వివాహ వేడుక తర్వాత ఇప్పటికీ నాగబాబు వారికి ఓ గిఫ్ట్ ను అందించాడు.